https://oktelugu.com/

జగన్‌ వలసలను ప్రోత్సహిస్తోంది అందుకేనా..?

రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. సీఎం అయ్యాక ఎవరు ఏ నిర్ణయమైనా చేస్తారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయడమే లక్ష్యం. అందుకే వలసలను ప్రోత్సహిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీ వైపే ఏ నేత అయినా మొగ్గు చూపుతుంటాడు. మొన్నటి వరకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏ స్థాయిలో వలసలను ప్రోత్సహించారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు జగన్‌ వంతు వచ్చింది. ఇప్పటివరకు పెద్దగా దృష్టి పెట్టని జగన్‌.. ఇప్పుడు వలసలకు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 09:25 AM IST
    Follow us on

    రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. సీఎం అయ్యాక ఎవరు ఏ నిర్ణయమైనా చేస్తారు. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయడమే లక్ష్యం. అందుకే వలసలను ప్రోత్సహిస్తూ ఉంటారు. అధికారంలో ఉన్న పార్టీ వైపే ఏ నేత అయినా మొగ్గు చూపుతుంటాడు. మొన్నటి వరకు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఏ స్థాయిలో వలసలను ప్రోత్సహించారో అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు జగన్‌ వంతు వచ్చింది. ఇప్పటివరకు పెద్దగా దృష్టి పెట్టని జగన్‌.. ఇప్పుడు వలసలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

    Also Read: ఏపీకొచ్చి మరీ జగన్ కు నిర్మల వార్నింగ్ ఇచ్చిందా?

    ఏపీలో ఇప్పుడు జగన్‌కు ఓ అంశం కలిసిరానుంది. పునర్విభజన చట్టం ప్రకారం అక్కడ అసెంబ్లీ స్థానాలను పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతమున్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు అదనంగా 50 నియోజకవర్గాలు కొత్తవి చేరనున్నాయి. దీంతో మొత్తం 225 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి. 2019 ఎన్నికలకు ముందే నియోజకవర్గాల సంఖ్య పెరగాల్సి ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో అది సాధ్యం కాలేదు.

    పాలన మీదనే.. స్కీంల మీద దృష్టి సారించిన జగన్‌ ఇప్పుడు నియోజకవర్గాల పెంపుపై సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇటీవల అమిత్‌ షాను కలిసినప్పుడు పునర్విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాలు పెంచాలని జగన్‌ కోరినట్లు సమాచారం. 50 నియోజకవర్గాల పెరిగితే వచ్చే ఎన్నికల సమయంలో టిక్కెట్ల కేటాయింపు కూడా పెద్ద సమస్య కాదు. అందుకే జగన్ ఎమ్మెల్యేలను మాత్రమే కాకుండా పట్టున్న నేతలను కూడా పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించుకున్నారు.

    Also Read: తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక

    ఈ విషయాన్ని నియోజకవర్గంలో కొందరు తనకు సన్నిహితులైన ఎమ్మెల్యేల వద్ద కూడా జగన్ ప్రస్తావించినట్లు సమాచారం. నియోజకవర్గాల పెంపుతో టిక్కెట్ల కేటాయింపు సమస్య ఉండదని జగన్ అభిప్రాయపడుతున్నారు. అందుకే టీడీపీపై అసంతృప్తిగా ఉన్న నేతలను పిలిచి వైసీపీ పార్టీ కండువాలు కప్పేందుకు సిద్ధమయింది. పార్టీలో చేరే వారికి ఇప్పటికిప్పుడు హామీ ఇవ్వకపోయినా తర్వాత పరిస్థితులను బట్టి టిక్కెట్ కేటాయించవచ్చన్న ఆలోచనలో జగన్ ఉన్నారు. మొత్తం మీద.. నియోజకవర్గ పునర్విభజనఅంశం తెర మీదకు రావడంతో ఇప్పుడు వలసలు పెంచి అందులోని సత్తా ఉన్న నేతలకు టికెట్లు ఇవ్వాలనేదే జగన్‌ భవిష్యత్‌ నిర్ణయమని తెలుస్తోంది.