https://oktelugu.com/

దుబ్బాకలో కాంగ్రెస్‌ గెలుస్తుందా..? బలాబలాలు ఏమిటీ

దుబ్బాక పోరు ఈసారి రసవత్తంగా కనిపిస్తోంది. రోజురోజుకూ రాజకీయాలు మారిపోతున్నాయి. నిన్నటి వరకు టీఆర్‌‌ఎస్‌లో ఉన్న క్యాండిడేట్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయ్యారు. మరోవైపు అధికార పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. ఆ బాధ్యతలను హరీష్‌ పైన వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తామే గెలుస్తామని అంటోంది కాంగ్రెస్‌ పార్టీ. మరి ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి అంత సీన్‌ ఉందా లేదా అనేది పోలింగ్‌ జరిగి ఫలితాలు వస్తే కానీ […]

Written By:
  • NARESH
  • , Updated On : October 8, 2020 / 09:40 AM IST
    Follow us on

    దుబ్బాక పోరు ఈసారి రసవత్తంగా కనిపిస్తోంది. రోజురోజుకూ రాజకీయాలు మారిపోతున్నాయి. నిన్నటి వరకు టీఆర్‌‌ఎస్‌లో ఉన్న క్యాండిడేట్‌ ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అయ్యారు. మరోవైపు అధికార పార్టీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. ఆ బాధ్యతలను హరీష్‌ పైన వేసుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా తామే గెలుస్తామని అంటోంది కాంగ్రెస్‌ పార్టీ. మరి ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి అంత సీన్‌ ఉందా లేదా అనేది పోలింగ్‌ జరిగి ఫలితాలు వస్తే కానీ తెలియదు.

    Also Read: కేసీఆర్ తో పెట్టుకున్న సీనియర్ ఐపీఎస్ కు చుక్కలట?

    2018లో జరిగిన ఎన్నికల్లో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో అన్ని పార్టీలు కలిసి.. రామలింగారెడ్డి ఒక్కడు సాధించిన ఓట్లు కూడా సాధించలేకపోయాయి. 62,500 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. రామలింగారెడ్డికి 89,299 ఓట్లు పోలవ్వగా.. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మద్దుల నాగేశ్వరరెడ్డికి 26,799, బీజేపీ క్యాండిడేట్‌ రాఘునందన్‌రావు 22,595 ఓట్లు సాధించారు.

    ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సెకండ్‌ ప్లేస్‌లో నిలిచింది. బీజేపీ మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్, బీజేపీలు క‌లిపి కూడా టీఆర్ఎస్ అభ్యర్థి సాధించిన ఓట్లలో స‌గం స్థాయిని అందుకోలేక‌పోయాయి. ఇక స‌మాజ్ వాదీ ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ త‌ర‌ఫున పోటీ చేసిన మ‌హిపాల్ రెడ్డి 12 వేల ఓట్లను సాధించాడు. కాంగ్రెస్, బీజేపీల త‌ర్వాతి స్థానంలో నిలిచాడు. వీరితో పాటు చాలా మంది ఇండిపెండెంట్లు, చిన్నాచితక పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో నిలిచారు. వారి స్థాయిలో వారు ఓట్లు సాధించారు.

    Also Read: తెలుగు రాష్ట్రాలకు మరో హెచ్చరిక

    ముందు నుంచి పట్టుతో ఉన్న దుబ్బాకకు మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నిక జరగబోతోంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అనారోగ్యంతో చనిపోవడంతో ఆయన భార్య సుజాతకే ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు. అయితే.. అటు రామలింగారెడ్డిపై ఉన్న అభిమానం, ఆయన మరణం నేపథ్యంలో సానుభూతి వచ్చే అవకాశాలూ లేకపోలేదు. అయినా.. ఎన్నికల క్షేత్రంలోకి అడుగు పెట్టాక ఏ పార్టీ అయినా పోటీ చేయక తప్పదు. గెలుపొందేందుకు శక్తులు ఒడ్డించక తప్పదు. ఇక్కడ ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌ పరిస్థితి ఎలా ఉన్నా కాంగ్రెస్‌ మాత్రం తమదే గెలుపు అని బహిరంగంగానే ప్రకటనలు చేస్తోంది.