https://oktelugu.com/

గాంధీ కుటుంబం ఇంతగా బరితెగించిందా?

గాంధీ-నెహ్రు కుటుంబం సోనియా గాంధీ చేతిలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం పరువు బజారున పడింది. తమ స్వార్ధం కోసం ఎంతకైనా దిగజారటానికి వెనుకాడలేదని చరిత్రలో జరిగిన సంఘటనలు చెబుతున్నాయి. చివరకు వేలకోట్ల రూపాయల కాంగ్రెస్ ఆస్తులు అప్పనంగా కాజేయటానికి కూడా వెనుకాడలేదు. అసలు గాంధీ పేరే పెద్ద కుట్ర. గాంధీకి వీళ్ళకు సంబంధమేంటి? ఫిరోజ్ జహంగీర్ గంధే ఫిరోజ్ గాంధీ ఎలా అయ్యాడో ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా వివరించాడా? చివరకు నెహ్రూ పై ఈగ వాలనివ్వని […]

Written By:
  • Ram
  • , Updated On : October 8, 2020 / 09:20 AM IST
    Follow us on

    గాంధీ-నెహ్రు కుటుంబం సోనియా గాంధీ చేతిలోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబం పరువు బజారున పడింది. తమ స్వార్ధం కోసం ఎంతకైనా దిగజారటానికి వెనుకాడలేదని చరిత్రలో జరిగిన సంఘటనలు చెబుతున్నాయి. చివరకు వేలకోట్ల రూపాయల కాంగ్రెస్ ఆస్తులు అప్పనంగా కాజేయటానికి కూడా వెనుకాడలేదు. అసలు గాంధీ పేరే పెద్ద కుట్ర. గాంధీకి వీళ్ళకు సంబంధమేంటి? ఫిరోజ్ జహంగీర్ గంధే ఫిరోజ్ గాంధీ ఎలా అయ్యాడో ఒక్క కాంగ్రెస్ నాయకుడైనా వివరించాడా? చివరకు నెహ్రూ పై ఈగ వాలనివ్వని చరిత్రకారుడు రామచంద్ర గుహ అయినా వివరించాడా? గాంధీ పేరుని తమ కుటుంబం చివరన చేర్చుకొని దేశ ప్రజల్ని మోసం చేయటం దేశంలోనే అతి పెద్ద కుంభకోణం, కుట్ర. కాదని ఎవరైనా నిరూపిస్తే వాళ్లకు దండ వేసి సన్మానం చేస్తాము. నిజాయితీగా తమ ఇంటిపేరు గంధే అని ఒప్పుకొని రాజకీయాలు నెరపితే కనీసం ఈతరం నాయకుల్లోనైనా నిజాయితీ వుందని ఒప్పుకుంటాము. ఇంత మోసపూరిత రాజకీయాలు చేసారు కాబట్టే ప్రజలు ఈరోజు 52 లోక్ సభ స్థానాలతో కూర్చోబెట్టారు. ఇప్పటికైనా నిజాయితీగా ప్రజలకోసం పని చేయొచ్చు కదా. ఇటువంటి దిగజారుడు రాజకీయాలు చేస్తే ఈసారి ఆ స్థానాలు కూడా రావు. ఎందుకు ఇలా రాయాల్సి వచ్చిందో ఒక్కసారి పరిశీలిద్దాం.

    హత్రాస్ ఘటన ఎలా చూడాలి?

    హత్రాస్ లో జరిగిన ఘటన సభ్యమానవ ప్రపంచం తల దించుకునేటట్లు చేసింది. ఇది ఈనాటి సమాజం పరిస్థితి. హత్రాస్ లాంటి ఘటనలు ప్రతిరోజూ దేశంలో ఎక్కడోచోట జరుగుతున్నందుకు సిగ్గుతో మనందరం తలదించుకోవాలి. అది దళితులకు కావచ్చు, వేరే కులంలో, మతం లో కావచ్చు. పురుషాధిక్య సమాజం మహిళను సమాన స్థాయిలో ఆదరించే స్థితికి చేరుకోలేకపోవటం ఈ దుస్థితికి కారణం. ముందుగా ఈ హత్రాస్ ఘటనకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమాధానం ఇవ్వాల్సిన అవసరం వుంది. ఈ మహిళపై లైంగిక అత్యాచారం జరిగిందా లేదా అనే వివాదం ఒక ఎత్తయితే రెండో కంటికి తెలియకుండా, కనీసం వాళ్ళ కుటుంబానికి చివరిచూపు చూపించకుండా అర్ధరాత్రి దహనం చేయటం క్షమించరాని నేరం. ఇందుకు శాంతి భద్రతలు సాకుగా చూపటం అంతకన్నా దారుణం. చివరకు ప్రజాభిప్రాయానికి భయపడి కావచ్చు కోర్టు అధ్వర్యంలో సిబీఐ విచారణకు ఒప్పుకోవటం యోగి చేసిన మంచిపని. అంతమాత్రాన తన ప్రభుత్వ పోలీసులు చేసిన నిర్వాకం క్షమించదగ్గది కాదు. ఇప్పటికైనా సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు కు విజ్ఞప్తి చేస్తూ అఫిడవిట్ దాఖలు చేయటాన్ని స్వాగతిద్దాం. ఇందులో ఇమిడివున్న నిజా నిజాలు దర్యాప్తులో తేలేవరకు వేచివుందాం.

    ఈ ఘటన స్వార్ధ రాజకీయాలకు బలి  

    గ్రామాల్లో పరిస్థితులు అతి సున్నితంగా వుండటం చూస్తున్నాము, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో మరీ ఎక్కువగా. వీటిని రెచ్చగొట్టు కుంటూ పోతే కొన్నాళ్ళకు సామాజిక ఘర్షణ శిఖరానికి చేరుతుంది. ఒకవైపు జరిగే దారుణాలకు కఠిన శిక్షలు పడేటట్లు చూస్తూనే రెండో వైపు సామాజిక సామరస్యాన్ని నెలకొల్పటానికి అందరం సమిష్టిగా కృషిచేయాలి. దీర్ఘకాలంలో అదే మన లక్ష్యం కావాలి. కులాలు, మతాలు మన మధ్య అడ్డుగోడలు కారాదు. మానవ సంబంధాలు ఉన్నత ఆశయాలపై నిర్మించబడాలి. అంతేగాని ఇటువంటి ఘటనలను ఘర్షణలు గా మార్చుకోకూడదు. ఇటువంటి దురదృష్టకర ఘటనలను బంగారు అవకాశంగా మలుచుకోవాలని కొంతమంది, కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నించటం దురదృష్టకరం. ఈ విషయంలో బహుజన్ సమాజ్ పార్టీ నేత, మాజీ ముఖ్యమంత్రి మాయావతి హుందాగా ప్రవర్తించింది. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని తప్పుపడుతూనే తమ డిమాండ్లు ప్రజలకు తెలియజేస్తూనే కొన్ని రాజకీయ పార్టీలు, ముఖ్యంగా గాంధీ కుటుంబం చేసిన చిల్లర, కుటిల రాజకీయాలు చేయలేదు.

    Also Read: దుబ్బాకలో కాంగ్రెస్‌ గెలుస్తుందా..? బలాబలాలు ఏమిటీ

    ఈ ఘటనపై రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిర్వహించిన ప్రచార పర్వం వెగటు పుట్టించే విధంగా వుంది. ముందుగా బయటపడిన ఆడియో టేపులు చూస్తే ఇండియా టుడే జర్నలిస్టు చనిపోయిన కుటుంబంతో మాట్లాడిన తీరు ఆశ్చర్యకరంగా వుంది. ఎటువంటి పరిస్థితుల్లో 25 లక్షల రూపాయల నష్టపరిహారం ఒప్పుకోవద్దని, 50 లక్షల రూపాయలకు బేరం పెట్టమని, తర్వాత ప్రియాంక గాంధీ ఎదుట ఏమి చెప్పాలో వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వటం చూస్తే ఆ అమ్మాయి జర్నలిస్ట్ పేరుతో వున్న కాంగ్రెస్ కార్యకర్తగా అనుకోవాలి. ఈ జర్నలిస్టు నిర్వాకాన్ని ఇండియా టుడే ఖండించక పోవటం ఆ ఛానల్ పెద్దవాళ్ళ మద్దత్తు తోనే ఇది జరిగిందని అనుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత రాహుల్ గాంధీ నడుస్తూ నడుస్తూ పొద చూసుకొని కింద పడటం చూసిన ఎవరికైనా రాహుల్ గాంధీ ఏ స్థాయి నాయకుడో అర్ధమయ్యింది. కెమెరాలు లేకపోతే తనన్ని నిజంగా పోలీసులే తోసేసారనే ఆరోపణని ప్రజలు నమ్మేవారు. చివరకు అన్న, చెల్లెలు కారులో వస్తూ ప్రవర్తించిన తీరు కూడా అసలు వీళ్ళు విషాదంలో వున్న కుటుంబాన్ని ప్రమర్శించటానికి వచ్చారా లేక విహారయాత్రకి వచ్చారా అని సందేహం కలుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు నిన్న బయటపడిన వీడియో క్లిప్పింగ్ మరో ఎత్తు. అది చూసినవాళ్ళకు గాంధీ కుటుంబం ఇంతగా కూడా దిగ జారుతారా అని ఆశ్చర్యం కలగక మానదు. ఆ వీడియో క్లిప్పులో ఏముంది?

    గాంధీ కుటుంబ అనుచరుడి కుట్ర బహిర్గతం 

    ష్యోరజ్ జీవన్ వాల్మీకి మామూలు మనిషి కాదు. ఎఐసిసి కార్యదర్శి , పార్లమెంటు సభ్యుడు, ఇంకా అనేక పదవుల్లో వున్నవాడు. సోనియా గాంధీ కుటుంబానికి సన్నిహితమైన వ్యక్తి. తను మాట్లాడిన భాష, భావం విన్న తర్వాత కాంగ్రెస్ పార్టీ కుతంత్రాలు ఇంత దారుణంగా ఉంటాయా అని ఆశ్చర్య పోవటం మన వంతు. శవాల మీద పేలాలు ఏరుకొనే బాపతు రకాలు వీరు. ఇలా మాట్లాడటం నా సహజ ధోరణి కి విరుద్ధమయినా ఆ స్టింగ్ ఆపరేషన్ వీడియో చూసిన తర్వాత నా వ్యాఖ్యానం తక్కువేమోనని అనిపిస్తుంది. తనే ముందుగా వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించానని, అవతలి కులాన్ని గురించి తిట్టటమే కాకుండా ఏమి చేసాడో కూడా చెప్పాడు. అల్లర్లు చెలరేగుతాయని, అటు, ఇటు తలలు లేస్తాయని, సిటీల్లో ఈ అల్లర్లు జరిగినా ఎవరినీ గుర్తుపట్టటం సాధ్యం కాదని, పిస్టళ్లు గాలిలో పేలిన తర్వాత చివరిలో రాహుల్ గాంధీ రంగ ప్రవేశం చేస్తాడని తన పధకాన్ని వెల్లడించాడు. 5,6 లక్షలు ఖర్చవుతుందని, ఆ డబ్బులు కావాలని కూడా చెప్పాడు. అంటే అల్లర్లు జరపటానికి కుట్ర పన్నినట్లు అర్ధమవుతుంది.

    Also Read: దుబ్బాకలో త్రిముఖ పోరు.. బరిలో గెలిచేదెవరు?

    మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఇతను ఏదో చోటా, మోటా నాయకుడు కాదు. ఎఐసిసి కార్యదర్శిగా చేసిన వ్యక్తి, పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికైన వ్యక్తి, గాంధీ కుటుంబానికి సన్నిహితమైన వ్యక్తి, అన్నింటికన్నా ముఖ్యంగా హత్రాస్ ఘటన లో ముఖ్యపాత్ర పోషిస్తున్న వ్యక్తి. మరి స్వయంగా తనే వీడియో లో ఇలా మాట్లాడితే ఇంతవరకు రాహుల్ గాంధీ గాని, ప్రియాంక గాంధీ గాని ఖండించిన పాపాన పోలేదు. టివి షో ల్లో మాట్లాడుతున్న ఒక్క కాంగ్రెస్ ప్రతినిధి కూడా దాన్ని ఖండించిన పాపాన పోలేదు. ఒక కపిల్ మిశ్రా మాట్లాడినా, మరో ష్యోరజ్ జీవన్ మాట్లాడినా అందరి మాటల్ని నిర్మొహమాటం లేకుండా ఖండించాలి. ఈ ఆలోచనలు సభ్య సమాజం తలదించుకునేవి. గాంధీ కుటుంబం దీని వెనక ఉందా లేదా అంటే పరిస్థితులు అవుననే సమాధానం వస్తుంది. ఇదంతా గాంధీ కుటుంబం పలుకుబడి పెంచటానికి చేసినట్లుగా స్పష్టంగా అర్ధమవుతుంటే కాదని ఎలా అనుకోగలం? కనీసం అతన్ని తక్షణమే పార్టీ నుంచి తొలగించి వుంటే గాంధీ కుటుంబానికి సంబంధం లేదని చెప్పటానికి కొంతయినా ఆస్కారం వుండేది.

    కిం కర్తవ్యం?

    రాజకీయాలు పూర్తిగా కలుషితమయ్యాయి, ఎవరు చెప్పేది నిజమో తెలుసుకోలేనంతగా. మొదట్లో రేప్ గురించి ప్రస్తావించని కుటుంబం వారం తర్వాత రేప్, గ్యాంగ్ రేప్ ఆరోపణలు చేయటం, అదే సమయం లో మరణ వాంగ్మూలం లో తనని గ్యాంగ్ రేప్ జరిగినట్లు మృతురాలు చెప్పటం, అటోప్సి నివేదిక, ఫోరెన్సిక్ నివేదికల్లో ఎక్కడా అటువంటి గుర్తులు లేకపోవటం అంతా గందరగోళం గా వుంది. అందుకే పూర్తి దర్యాప్తు అయ్యిందాకా వేచి చూడక తప్పదు. ఈ లోపల వివిధ రాజకీయ పార్టీలు, ఇస్లామిక్ రాడికల్ సంస్థలు దీనిలో చొరబడి యోగి ఆదిత్యనాథ్ పై దొరికిన బంగారు అవకాశంగా భావించటం, కాంగ్రెస్ దీన్ని బీహార్ ఎన్నికల్లో ఉపయోగించుకోవచ్చని కుట్ర పన్ని రెచ్చగొట్టటం చూస్తుంటే వీళ్ళకు ఆ కుటుంబానికి న్యాయం కన్నా వీళ్లకు న్యాయం కోసం చూస్తున్నట్లుగా వుంది. దళితులపై చూపించే ఈ మమకారం నిజంగా వుండి  వుంటే దళిత కుటుంబాలు ఇంకా ఈ స్థితి లో ఎందుకున్నాయో గాంధీ కుటుంబం చెప్పాలి.