https://oktelugu.com/

బీజేపీ అందుకే పోలవరాన్ని పక్కనపెట్టిందా..!

దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిన బీజేపీ ఇప్పుడు ప్రధానంగా ఏపీపైనే ఫోకస్‌ పెట్టింది. అందుకే ఈ పోలవరం డ్రామాలో జగన్‌ను ఇరికించాలని చూస్తోందని అంటన్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. జగన్ హయాం వచ్చే సరికే పోలవరంపై బీజేపీ తన స్టంట్‌ను మార్చుకుందట. వీలైతే దీన్ని తమ ఎన్నికల ప్రధానాస్త్రంగా మార్చుకోవాలని చూస్తోందట. Also Read: బీహార్‌‌ ఎన్నికల్లో ఆ రెండు సామాజిక వర్గాలదే ‘కీ’ రోల్‌ గతంలో పోలవరంపై కేంద్రం ఉత్సాహంగా ఉన్నా.. సొంత లాభం కోసం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 3:12 pm
    Follow us on

    Jagan modi

    దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించిన బీజేపీ ఇప్పుడు ప్రధానంగా ఏపీపైనే ఫోకస్‌ పెట్టింది. అందుకే ఈ పోలవరం డ్రామాలో జగన్‌ను ఇరికించాలని చూస్తోందని అంటన్నారు పలువురు రాజకీయ విశ్లేషకులు. జగన్ హయాం వచ్చే సరికే పోలవరంపై బీజేపీ తన స్టంట్‌ను మార్చుకుందట. వీలైతే దీన్ని తమ ఎన్నికల ప్రధానాస్త్రంగా మార్చుకోవాలని చూస్తోందట.

    Also Read: బీహార్‌‌ ఎన్నికల్లో ఆ రెండు సామాజిక వర్గాలదే ‘కీ’ రోల్‌

    గతంలో పోలవరంపై కేంద్రం ఉత్సాహంగా ఉన్నా.. సొంత లాభం కోసం చంద్రబాబు ఆ ప్రాజెక్ట్ ని, తన ఏటీఎంగా మార్చుకున్నారు. డైలీ సీరియల్‌లా సాగదీశారు. ఎన్నేళ్లు నిర్మాణం కొనసాగితే, అన్నేళ్లపాటు జేబులు నింపుకోవచ్చనే ఉద్దేశంతో దాన్ని అలా కొనసాగిస్తూ వచ్చారు బాబు.

    అయితే.. ఇప్పుడు జగన్‌కు కేంద్రం సహకరించడం లేదు. పోలవరం ప్రాజెక్టుకు పాత లెక్కల్లోనే ఖర్చులు ఇస్తామని చెప్పుకొస్తోంది. దీంతోపాటు ప్రత్యేక హోదా నుంచి ఏపీ ప్రజల్ని డైవర్ట్ చేయాలంటే పోలవరం ప్రాజెక్టుకు మించిన అంశం మరొకటి లేదని బీజేపీ అనుకుంటున్నట్లు సమాచారం. అందుకే ఎన్నడూ లేని విధంగా పోలవరం ప్రాజెక్టుపై కొత్త మెలికలు పెడుతోంది కేంద్రం. వైసీపీ హయాంలో పోలవరం పూర్తయితే ఆ క్రెడిట్ అంతా జగన్‌కే వెళ్తుంది. అందుకే నిధుల విషయంలో తఖరారు మొదలు పెట్టింది. విభజన చట్టంలో ఉన్న ఈ హామీని పూర్తిగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే అయినా, రాష్ట్ర ప్రభుత్వాలపై నెట్టేస్తోంది.

    Also Read: ఎంసెట్ రాసిన విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..!

    వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో బీజేపీ మేనిఫెస్టో కూడా ఇదే ప్రధానాంశం కాబోతోంది. ప్రాజెక్ట్ పూర్తికావాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీయే అధికారంలో ఉండాలనే నినాదంతో ఆ పార్టీ శ్రేణులు ఎన్నికలకు వెళ్లనున్నారు. అప్పటిలోగా టీడీపీని పూర్తిగాలేకుండా చేసి.. బీజేపీనే అధికారంలోకి రావాలని ప్లాన్‌ చేస్తోంది. అందుకే జాతీయ ప్రాజెక్టును ప్రకటించి ఇప్పుడు పక్కన పెట్టేసేందుకు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. గతంలో టీడీపీ వల్ల ఆలస్యం అవుతోన్న ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు బీజేపీ వల్ల వెనక్కి వెళ్లిపోతోంది. కేంద్రం, రాష్ట్ర రాజకీయాలతో ఏపీలోని పోలవరం ప్రాజెక్టు బలవుతున్నట్లే చెప్పొచ్చు.