https://oktelugu.com/

ఇంట్రెస్టింగ్.. పవన్ ను ఢీకొట్టనున్న అభిమాని..! 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారాడు. పవన్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉండగా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దసరా సందర్భంగా పవన్ కొత్త సినిమా అప్డేట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది. Also Read: నాగబాబుపై చిరు ట్వీట్.. నేనెప్పుడూ నీతోనే అన్న నాగబాబు ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించనుండగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 01:54 PM IST
    Follow us on

    పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక వరుస సినిమాలతో బీజీగా మారాడు. పవన్ చేతిలో ఇప్పటికే నాలుగు సినిమాలు ఉండగా తాజాగా మరో క్రేజీ ప్రాజెక్టుకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దసరా సందర్భంగా పవన్ కొత్త సినిమా అప్డేట్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ అధికారికంగా ప్రకటించింది.

    Also Read: నాగబాబుపై చిరు ట్వీట్.. నేనెప్పుడూ నీతోనే అన్న నాగబాబు

    ‘అప్పట్లో ఒకడుండేవాడు’ ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ మూవీకి దర్శకత్వం వహించనుండగా సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మించనున్నాడు. దసరా సందర్భంగా ‘కింగ్ ఆఫ్ యాటిట్యూడ్.. తెలుగు సినిమా ఫేవరేట్ పోలీస్ ఆఫీసర్ మరోసారి హై ఓల్టేజ్ రోల్ తో రాబోతున్నారు’ అంటూ చిత్రబృందం ప్రకటించింది.

    మలయాళంలో సూపర్ హిట్టుగా నిలిచిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రానికి రీమేక్ గా ఈ మూవీ రానుందని సమాచారం. ఒరిజనల్ వర్షన్లో బిజూ మీనన్ పోషించిన పోలీస్ ఆఫీసర్  పాత్రలో పవన్ కల్యాణ్ నటించనున్నాడు. పృథ్వీరాజ్ పాత్రను దగ్గుబాటి రానా చేస్తాడనే టాక్ విన్పించింది. అయితే తాజాగా మరో హీరో పేరు తెరపైకి రావడం ఆసక్తిని రేపుతోంది.

    ‘అయ్యప్పనుమ్ కోషియమ్’లో పవన్ డై హార్డ్ ఫ్యాన్.. యంగ్ హీరో నితిన్ నటించనున్నాడనే టాక్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నితిన్ ఇప్పటికే పలు సినిమాల్లో నటించాడు. ఇటీవల నితిన్ నటించిన భీష్మ కూడా ఈ బ్యానర్లో చేసిందే. తాజాగా పవన్ కల్యాణ్ పక్కన ఆఫర్ రావడంతో వెంటనే ఒప్పకున్నాడనే టాక్ విన్పిస్తోంది.

    Also Read: ఆర్‌‌ఆర్‌‌ఆర్‌‌ సెట్‌లోకి సీత!

    కథ రీత్య ఇద్దరు హీరోల ఇగోల వల్ల వాళ్ళ జీవితాల్లో అనుహ్య సంఘటనలు చోటుచేసుకుంటాయట. ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఢీ అంటై ఢీ అంటారు. దీంతో పవర్ స్టార్ ను తన డై హార్డ్ ఫ్యాన్ ఢీ కొట్టేందుకు సిద్ధపడుతున్నారు. నితిన్ ఎప్పటి నుంచో తన అభిమాన హీరో పవన్ తో ఓ సినిమా చేయాలన. ఇక ఈ వార్త నిజమే అయితే గానుక అతడి కోరిక తీరినట్లేనని ఫ్యాన్స్ అంటున్నారు.