https://oktelugu.com/

సినీ ఇండస్ట్రీ: దసరా పాయే.. దీపావళికి పేలుతాయా?

కరోనా ఎఫెక్ట్ సినిమారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఆరేడు నెలలుగా థియేటర్లు మూతపడగా.. షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కొద్దిరోజులుగా షూటింగులు మళ్లీ మొదలవగా ఇటీవలే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. Also Read: నాగబాబుపై చిరు ట్వీట్.. నేనెప్పుడూ నీతోనే అన్న నాగబాబు కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు ఓపెన్ చేసినప్పటికీ నిర్వహాణ ఖర్చులు కూడా రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం […]

Written By:
  • NARESH
  • , Updated On : October 29, 2020 / 02:00 PM IST
    Follow us on

    కరోనా ఎఫెక్ట్ సినిమారంగంపై తీవ్ర ప్రభావం చూపింది. గత ఆరేడు నెలలుగా థియేటర్లు మూతపడగా.. షూటింగులు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కొద్దిరోజులుగా షూటింగులు మళ్లీ మొదలవగా ఇటీవలే థియేటర్లు ఓపెన్ అయ్యాయి.

    Also Read: నాగబాబుపై చిరు ట్వీట్.. నేనెప్పుడూ నీతోనే అన్న నాగబాబు

    కరోనా నిబంధనలు పాటిస్తూ థియేటర్లు ఓపెన్ చేసినప్పటికీ నిర్వహాణ ఖర్చులు కూడా రావడం లేదు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపడంలేదు. దీంతో గత ఆరేడు నెలలుగా ఓటీటీలకు అలవాటుపడిన ప్రేక్షకులు ఇంకా అటువైపు మొగ్గుచూపుతున్నారు.

    దసరా సందర్భంగా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు రిలీజయ్యాయి. అయితే ఓటీటీల్లో రిలీజవుతున్న సినిమాలన్నీ ప్లాప్ టాక్ తెచ్చుకుండటంతో సినీప్రియులు నిరాశ చెందుతున్నారు. దసరా సందర్భంగా ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ‘కలర్ ఫొటో’ సైతం ప్రేక్షకులను నిరాశపరిచింది.

    ‘కలర్ ఫొటో’ పండుగకు తగ్గ సినిమా అని తేలిపోవడంతో అందరి దృష్టంతా దీపావళిపై పడింది. దీపావళి నాటికి థియేటర్లు కూడా ఫుల్ అక్యుపెన్సీతో నడుస్తాయనే టాక్ విన్పిస్తోంది. దీంతో ఓటీటీలతోపాటు థియేటర్లు కూడా కళకళలాడుతాయనే టాక్ సినీ వర్గాల్లో విన్పిస్తోంది.

    Also Read: ఇంట్రెస్టింగ్.. పవన్ ను ఢీకొట్టనున్న అభిమాని..!

    దీపావళికి వారం ముందుగానే ‘మా వింత గాథ వినుమా’ రిలీజ్ కానుంది. కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’.. సాయిధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’.. అక్షయ్ కుమార్ ‘లక్ష్మీబాంబ్’.. సూర్య ‘ఆకాశం నీ హద్దురా’.. విశాల్ ‘చక్ర’ ఓటీటీల్లో విడుదల కానున్నాయి. థియేటర్లలోనూ పలు సినిమాలు రిలీజ్ కానుండటంతో దీపావళి సందడి ఖాయంగా కన్పిస్తోంది.