https://oktelugu.com/

సోనియాగాంధీ ఫెయిల్ అయ్యేది అక్కడే?

ఏ పార్టీకి అయినా.. నాయకుడు బలంగా ఉంటేనే పార్టీ బలమైన నాయకత్వాన్ని కలిగి ఉంటుంది. జాతీయ పార్టీ కూడా ఇదే వర్తిస్తుంది. అంతేకాదు.. జాతీయ పార్టీలు ఓ విషయాన్ని బలంగా గ్రహించాల్సి ఉంటుంది. అదేంటంటే.. ఏ రాష్ట్రంలోనైనా పార్టీ బలంగా ఉండాలంటే అక్కడ నాయకత్వం బలంగా ఉండాలి. నాయకుడు బలంగా ఉంటేనే అక్కడ పార్టీ బలంగా ఉంటుంది. అయితే.. కాంగ్రెస్‌ పార్టీలో ముందు నుంచీ ఆ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. అందుకే.. ఆ పార్టీ ఇంకా కోలుకోలేకపోతోంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 3, 2021 / 11:03 AM IST
    Follow us on


    ఏ పార్టీకి అయినా.. నాయకుడు బలంగా ఉంటేనే పార్టీ బలమైన నాయకత్వాన్ని కలిగి ఉంటుంది. జాతీయ పార్టీ కూడా ఇదే వర్తిస్తుంది. అంతేకాదు.. జాతీయ పార్టీలు ఓ విషయాన్ని బలంగా గ్రహించాల్సి ఉంటుంది. అదేంటంటే.. ఏ రాష్ట్రంలోనైనా పార్టీ బలంగా ఉండాలంటే అక్కడ నాయకత్వం బలంగా ఉండాలి. నాయకుడు బలంగా ఉంటేనే అక్కడ పార్టీ బలంగా ఉంటుంది. అయితే.. కాంగ్రెస్‌ పార్టీలో ముందు నుంచీ ఆ లోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంటుంది. అందుకే.. ఆ పార్టీ ఇంకా కోలుకోలేకపోతోంది.

    Also Read: మోడీ ఫెయిల్ అయ్యేది.. కేసీఆర్, జగన్ లు హిట్ అయ్యింది అక్కడే?

    ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ.. గాంధీ కుటుంబంలో ఎవరైనా సరే రాష్ట్రంలో బలమైన నాయకుడిని ఎవరినీ ఎదగనివ్వరు. అయితే.. ఇదివరకు ఉండే ఇమేజ్ తో కొన్ని ఎన్నికల్లో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయగలిగింది. కానీ సోనియా గాంధీ హయాంలో మాత్రం కాంగ్రెస్ మరింత బలహీనం కావడానికి రాష్ట్రాల్లో నాయకత్వ లోపమే కారణమని చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడు కారణంగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు సార్లు పార్టీ అధికారంలోకి రాగలిగింది. అటువంటిది ఆయన తనయుడు జగన్‌ను దూరం చేసుకున్న తర్వాత ఇప్పుడు పార్టీకి నాయకత్వ సమస్య ఏర్పడింది.

    ఇక కర్ణాటకలోనూ సిద్ధరామయ్య ఒంటి చేత్తో పార్టీని నడుపుతున్నారు. ఇప్పుడు ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్ కు నాయకత్వం లేదు. తమిళనాడును తీసుకుంటే అక్కడ చిదంబరం వంటి నేతలున్నా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే కనిపిస్తారు. తమిళనాడు రాజకీయాలను పట్టించుకోరు. అటువంటి వారినే కాంగ్రెస్ ప్రోత్సహిస్తూ వస్తోంది. ఇప్పుడు అక్కడ డీఎంకే దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి. ఇక పశ్చిమ బెంగాల్‌లోనూ అంతే. బలమైన నేతగా భావించి మమత బెనర్జీని కాంగ్రెస్ దూరం పెట్టింది. దీంతో ఆమె వేరే పార్టీ పెట్టుకుని రెండు సార్లు అధికారంలోకి రాగలిగారు.

    Also Read: తిరుపతిలో బరి నుంచి తప్పుకుంటాం కానీ..! : జనసేనకు బీజేపీ మెలిక

    ఇక కేరళలోనూ అంతే. ఉమెన్ చాందీ వంటి నేతలున్నా ఫైర్ బ్రాండ్లుగా పేరుపడిన నేతలెవరూ లేరు. ఉత్తరప్రదేశ్‌లోనూ సరైన నాయకుడు లేకపోవడంతో ప్రియాంక గాంధీని రంగంలోకి దించాల్సి వచ్చింది. చరిష్మా, ప్రజల్లో పట్టున్న నేతకు పార్టీ పగ్గాలు అప్పగిస్తేనే కాంగ్రెస్ రాష్ట్రాల్లో పుంజుకుంటుందన్న విషయం అనేక సార్లు రుజువైనా, పార్టీ అధిష్టానం మాత్రం పట్టించుకోదు. దీంతో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ కనుమరుగైంది. ఇప్పటికైనా బలమైన నాయకుడిని నమ్మి జనంలోకి పంపాలన్నది క్యాడర్ కోరుకుంటోంది. ఇప్పటికైనా కాంగ్రెస్‌ హైకమాండ్‌ కళ్లు తెరిచి పార్టీని అధికారంలోకి తెచ్చే నాయకుడిని పట్టించుకుంటే సరి.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్