ప్రపంచ దేశాల్లో కరోనా మహమ్మారి ఉధృతి ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. ఒకటికి మించి కరోనా వ్యాక్సిన్లు సక్సెస్ కావడంతో త్వరలోనే కరోనా మహమ్మారిని అంతం చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. పలు దేశాల్లో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివరి నాటికి మన దేశంలో కొన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరగనుందని సమాచారం. అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా సైడ్ ఎఫెక్ట్స్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి.
Also Read: ఆత్మనిర్భర్.. భారత్ సాధించిన ఘనత ఇదీ
దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఒకరిద్దరు మృతి చెందుతుండటంతో వ్యాక్సిన్ సమర్థతపై ప్రజల్లో
కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి కొంతమంది సుముఖత చూపడం లేదు. అయితే ఇలాంటి సమయంలో క్యాండిడా ఆరిస్ అనే ఫంగస్ వల్ల ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Also Read: కరోనా సోకినా.. మనకు వైరస్ లక్షణాలు ఎందుకు కనిపించడం లేదు..? కారణమిదేనా..?
లండన్ కు చెందిన ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు ఈ ఫంగస్ కు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. గతంలో విజృంభించిన ప్లేగు తరహాలో క్యాండిడా ఆరిస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఈ ఫంగస్ బారిన పడితే మందులు కూడా పని చేయవని వెల్లడిస్తున్నారు. ఈ ఫంగస్ బారిన పడ్డ వాళ్లు బ్రతికే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతుండటం గమనార్హం.
మరిన్ని వార్తలు కోసం: కరోనా వైరస్
క్యాండిడా ఆరిస్ రక్తంలోకి ప్రవేశిస్తే ఎలాంటి విరుగుడుకు లొంగదని.. పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శాస్త్రవేత్తలు 2016 సంవత్సరంలో ఇంగ్లండ్ లో ఈ ఫంగస్ యొక్క ఆనవాళ్లను గుర్తించారు. కోతుల ద్వారా వ్యాప్తి చెందే ఈ ఫంగస్ ఎలాంటి వాతావరణంలోనైనా జీవితంచగలదని తెలుస్తోంది. కరోనా కంటే ఎన్నో రెట్లు ఈ ఫంగస్ ప్రమాదకరమని ఈ ఫంగస్ విజృంభించే అవకాశాలు కనిపిస్తున్నాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.