దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం యుగాంతం కాబోతుందని వార్తలు తెగ వైరల్ అయ్యాయి. అయితే ప్రజల్లో చాలామంది ఆ వార్తలను పెద్దగా పట్టించుకోలేదు. అయితే గతేడాది కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాప్తి చెంది ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. కరోనా విజృంభణ తరువాత యుగాంతం వచ్చినా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
Also Read: పోస్టాఫీస్ లో సూపర్ స్కీమ్స్.. ఎక్కువ రాబడి పొందే ఛాన్స్..?
ఇదే సమయంలో డూమ్స్ డే క్లాక్ త్వరలోనే ప్రపంచం వినాశనం కాబోతుందని హెచ్చరిస్తోంది. నిపుణులు సైతం త్వరలో ప్రపంచం అంతమైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడుతున్నారు. అటామిక్ సైంటిస్ట్ బులెటిన్ అధ్యక్షుడు రేచెల్ బ్రాన్సన్ పర్యావరణంలో కీలక మార్పులు, కరోనా, అణు యుద్ధం ముప్పు డూమ్స్ డే క్లాక్ అర్ధరాత్రికి మరింత చేరువ కావడానికి కారణమైందని తెలిపారు.
Also Read: సుకన్య సమృద్ధి ఖాతా ఉందా.. బ్యాలెన్స్ ఎలా తెలుసుకోవాలంటే..?
గతేడాది డూమ్స్ డే క్లాక్ అర్ధరాత్రికి రెండు నిమిషాలకు దూరంలో ఉండగా ఇప్పుడు ఆ క్లాక్ 100 సెకన్లకు చేరింది. భూమిపై మానవాళి అంతాన్ని సూచించే క్లాక్ ను డూమ్స్ డే క్లాక్ అని అంటాం. 1947 సంవత్సరంలో ఐన్ స్టీన్, షికాగో యూనివర్సిటీ విద్యార్థులు కలిసి డూమ్స్ డే క్లాక్ ను అభివృద్ధి చేశారు. ఈ డూమ్స్ డే క్లాక్ ప్రపంచం వినాశనానికి అతి దగ్గరలో ఉందని 1953 సంవత్సరంలో తొలిసారి చూపించింది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
డూమ్స్ డే క్లాక్ ప్రస్తుతం అర్ధరాత్రికి కొన్ని సెకన్ల దూరంలో ఉండటంతో శాస్త్రవేత్తలు కరోనాను ఎదుర్కోవడానికి సంసిద్ధంగా లేకపోవడం, సైన్స్ పై ప్రజల్లో నమ్మకం లేకపోవడం ఈ క్లాక్ 100 సెకన్లకు చేరువ కావడానికి కారణమని చెబుతున్నారు. ప్రపంచం అణ్వాయుధాలతో అంతమయ్యే అవకాశం ఉండటం వల్ల అణ్వాయుధాలను లేకుండా చేయాలని నిపుణులు పిలుపునిస్తున్నారు.