https://oktelugu.com/

Renu Desai: ప్రధానితో అకీరా… రేణు దేశాయ్ చేసిన పనికి పవన్ ఫ్యాన్స్ హర్ట్!

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తో భేటీ అయిన పవన్, అనంతరం అకీరాను ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ప్రధాని మోడీని కలిశారు పవన్ కళ్యాణ్. గురువారం సాయంత్రం తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్ తో కలిసి మోడీతో భేటీ అయ్యారు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 7, 2024 / 05:04 PM IST

    Renu Desai

    Follow us on

    Renu Desai: ఆంధ్రప్రదేశ్ 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి రికార్డు స్థాయి విజయం సాధించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ తండ్రి వెంటే ఉంటున్నాడు. అకీరాను రాజకీయ ప్రముఖులకు పవన్ పరిచయం చేస్తున్నారు. ఇప్పుడు మీడియాలో అకీరా బాగా హైలెట్ అవుతున్నాడు.

    టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తో భేటీ అయిన పవన్, అనంతరం అకీరాను ప్రత్యేకంగా పరిచయం చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా ప్రధాని మోడీని కలిశారు పవన్ కళ్యాణ్. గురువారం సాయంత్రం తన భార్య అన్నా లెజినోవా, కుమారుడు అకీరా నందన్ తో కలిసి మోడీతో భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులను మోడీకి పరిచయం చేశారు. అకీరా ప్రధాని కి చేతులు జోడించి నమస్కరించాడు.

    ప్రధాని మోడీ అకీరా భుజంపై చేయి వేసి మాట్లాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఘటనపై అకీరా తల్లి, పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘ నేను ఎప్పటినుంచో బీజేపీ వ్యక్తిని. ఈ రోజు నా కొడుకు అకీరాను పీఎం నరేంద్ర మోడీ గారు పక్కన చూడడం ఎంతో ఆనందంగా, ఎమోషనల్ గా ఉంది. దీని గురించి చాలా రాయాలని ఉంది.

    కానీ నాకు మాటలు రావడం లేదు. నేను చాలా ఎమోషనల్ అవుతున్నాను. మోడీని కలిసిన అకీరా నాకు కాల్ చేశాడు. మోడీ గారు చాలా స్ట్రాంగ్ పర్సన్ .. ఆయన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ ఉంది అని చెప్పాడు ‘ అంటూ రేణుదేశాయ్ రాసుకొచ్చారు. అకీరా, మోడీ పక్కపక్కనే నిల్చొని పోజిస్తున్న ఫోటో రేణు దేశాయ్ షేర్ చేశారు. అయితే ఆమె పవన్ కళ్యాణ్ లేకుండా వారిద్దరే ఉన్న ఫోటో పంచుకోవడం ఫ్యాన్స్ కి నచ్చలేదు. మోడీని అకీరా కలవడానికి కారణమైన వ్యక్తిని పక్కన పెట్టడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.