సుశాంత్ సింగ్ డ్రగ్స్‌ కేసుకు బ్రేక్‌ పడినట్లేనా?

డ్రగ్స్‌ కేసు బాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. విచారిస్తుండగా విచారిస్తుండగా రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటి దాకా ఓ స్థాయిలో స్పీడ్‌గా సాగిన విచారణ ఇప్పుడు స్లో అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్రగ్స్‌ కేసు దర్యాప్తు సాగిస్తున్న నార్కొటిక్స్‌ ఉన్నతాధికారికి కరోనా సోకడమే ఇందుకు కారణం. ఇక కేసులో పురోగతిపై కనిపించే అవకాశాలు కనిపించడంలేదు. డ్రగ్స్ కేసు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడటమో లేక.. వేగం తగ్గడమో కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం బాలీవుడ్ […]

Written By: NARESH, Updated On : October 4, 2020 2:44 pm
Follow us on


డ్రగ్స్‌ కేసు బాలీవుడ్‌ను షేక్‌ చేస్తోంది. విచారిస్తుండగా విచారిస్తుండగా రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఇప్పటి దాకా ఓ స్థాయిలో స్పీడ్‌గా సాగిన విచారణ ఇప్పుడు స్లో అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్రగ్స్‌ కేసు దర్యాప్తు సాగిస్తున్న నార్కొటిక్స్‌ ఉన్నతాధికారికి కరోనా సోకడమే ఇందుకు కారణం. ఇక కేసులో పురోగతిపై కనిపించే అవకాశాలు కనిపించడంలేదు. డ్రగ్స్ కేసు విచారణకు తాత్కాలికంగా బ్రేక్ పడటమో లేక.. వేగం తగ్గడమో కావచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం బాలీవుడ్ సెలెబ్రిటీలకు తాత్కాలికంగా ఊరట కలిగిస్తుందని చెబుతున్నారు.

Also Read: బిగ్ బాస్ కాదు బ్యాడ్ బాస్.. అన్యాయంగా ఇద్దరి ఎలిమినేషన్..?

బాలీవుడ్‌ యువ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డెత్‌ కేసులో డ్రగ్స్‌ కోణం వెలుగులోకి వచ్చింది. దీంతో ప్రస్తుతం ఈ కేసును నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. డ్రగ్స్ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలీవుడ్‌కు చెందిన పలువురు టాప్ సెలెబ్రిటీలకు నార్కొటిక్స్ అధికారుల నుంచి నోటీసులు అందాయి. విచారణకూ హాజరవుతున్నారు. టాప్ హీరోయిన్లు దీపికా పడుకొణె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, దర్శకుడు అనురాగ్ కశ్యప్ వంటి బాలీవుడ్ పర్సనాలిటీలు నార్కొటిక్స్ అధికారుల వద్ద విచారణను ఎదుర్కొన్నారు. టాలీవుడ్‌కు చెందిన రకుల్‌ను కూడా విచారించారు.

అయితే.. ఈ కేసు విచారిస్తున్న నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్‌‌ కేపీఎల్‌ మల్హోత్ర కరోనా వైరస్‌ బారిన పడ్డారు. అనారోగ్యానికి గురైన ఆయనకు టెస్టులు చేయగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆయన క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. రెండువారాల పాటు క్వారంటైన్ కాలాన్ని గడిపిన తరువాత మళ్లీ విచారణ ప్రారంభం కానుంది. అయితే.. మల్హోత్రాకు వైరస్ ఎలా సోకిందనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Also Read: ‘నిశ్శబ్ధం’ ఫ్లాప్ కు ఆయనే కారణమా?

ఇక విచారణలో ప్రధాన అధికారే కరోనా బారిన పడడంతో డ్రగ్స్‌ కేసు కాస్త నెమ్మదించే అవకాశాలు లేకపోలేదు. అయితే.. మల్హోత్రా స్థానంలో మరో అధికారికి ఆ బాధ్యతలు అప్పగిస్తారనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ డ్రగ్స్‌ కేసు ఇప్పటికే బాలీవుడ్‌, టాలీవుడ్‌తోపాటు కర్ణాటక చిత్ర పరిశ్రమనూ తాకింది. ఇప్పటికే శాండల్‌వుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా విచారణను ఎదుర్కొంటూనే ఉన్నారు. నటి సంజన, రాగిణి ద్వివేదిని అరెస్టు కూడా చేశారు. తాజాగా.. అధికారి కరోనా బారిన పడడంతో కేసుకు బ్రేక్‌ పడుతుందా.. లేదా మరో అధికారి వచ్చి విచారణ చేపడుతారా అని ఆసక్తి నెలకొంది.