ట్రంప్ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠ.!

కరోనా మహమ్మరి ప్రపంచాన్నీ పట్టిపీడిస్తోంది. చిన్న.. పెద్ద.. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావం చూపుతోంది. అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతోంది. కరోనాను కట్టడి చేయలేక చేత్తులేత్తోంది. కరోనా కేసుల్లో అమెరికా తొలిస్థానంలో ఉండటం గమనార్హం. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుహ్యంగా కరోనా బారిన పడటంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. Also Read: సుశాంత్ సింగ్ డ్రగ్స్‌ కేసుకు బ్రేక్‌ పడినట్లేనా? అమెరికాలో కరోనా నివారణకు అధ్యక్షుడు ట్రంప్ […]

Written By: NARESH, Updated On : October 4, 2020 2:39 pm
Follow us on

కరోనా మహమ్మరి ప్రపంచాన్నీ పట్టిపీడిస్తోంది. చిన్న.. పెద్ద.. పేద, ధనిక అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావం చూపుతోంది. అగ్రరాజ్యంగా పేరున్న అమెరికా సైతం కరోనా ధాటికి విలవిలలాడిపోతోంది. కరోనాను కట్టడి చేయలేక చేత్తులేత్తోంది. కరోనా కేసుల్లో అమెరికా తొలిస్థానంలో ఉండటం గమనార్హం. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుహ్యంగా కరోనా బారిన పడటంతో అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.

Also Read: సుశాంత్ సింగ్ డ్రగ్స్‌ కేసుకు బ్రేక్‌ పడినట్లేనా?

అమెరికాలో కరోనా నివారణకు అధ్యక్షుడు ట్రంప్ అనేక చర్యలు చేపట్టారు. అయినా ఫలితం మాత్రం కన్పించడం లేదని ట్రంప్ కరోనా బారినపటడం ద్వారా అర్థమవుతోంది. అయితే ట్రంప్ కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లనే ఆయన వైరస్ సోకినట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన వ్యక్తిగత సహాయకురాలు కరోనా బారినపడింది. దీంతో ట్రంప్ దంపతులు కరోనా టెస్టులు చేయించుకున్నారు.

ఈనేపథ్యంలో ట్రంప్ కు కరోనా సోకిందనే ప్రచారం జరుగుతోంది. ట్రంప్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయనకు రెమ్ డిసివిర్ తోపాటు మరిన్ని యాంటీబాడీ ఔషధాల్ని వైద్యులు ఇస్తున్నారు. అయితే రానున్న 48గంటలు కీలకంగా మారనున్నాయట. ట్రంప్ కరోనా బారిన 24గంటల్లోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందనే ప్రచారం జరిగింది. ఆ వెంటనే ట్రంప్ ను వైట్ హౌజ్ వర్గాలు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయించినట్లు తెలుస్తోంది.

Also Read: జగన్, మోడీ భేటి: టార్గెట్ టీడీపీయేనా?

ప్రస్తుతం ట్రంప్ ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైట్ హౌజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలే ట్రంప్ తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్పందించారు. తాను క్షేమంగా ఉన్నానని.. త్వరలోనే కరోనాను జయిస్తానంటూ వీడియో రిలీజ్ చేశాడు. అయితే అనుహ్యంగా ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో అమెరికాలో ఉత్కంఠత నెలకొంది. రాబోయే 48గంటలు ట్రంప్ ఆరోగ్యానికి చాలా కీలకమనే ప్రచారం జరుగుతోంది. దీంతో అమెరికన్లంతా ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు.