YS Sharmila: షర్మిల సాక్ష్యమే కీలకమా?

YS Sharmila: వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య రోజుకో మ‌లుపు తిరుగుతోంది. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్ల‌డంతో మొద‌ట సాధార‌ణ మ‌ర‌ణంగా భావించిన కేసు హ‌త్య‌గా అనుమానం రావ‌డంతో కీల‌కంగా మారుతోంది. ప్ర‌తిప‌క్ష నేత‌లపై అనుమానాలు వ్య‌క్తం చేసినా త‌రువాత క్ర‌మంలో వైసీపీ నేత‌లే నిందితులుగా తేల‌డంతో వైసీపీ ప‌రువు కూడా పోతోంది. ఇన్నాళ్లు రెండు పార్టీలు నిందించుకున్న ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల మెడ‌కు చెట్టుకోవ‌డంతో ఎటూ తేల్చుకోలేక‌పోతోంది. ఈ నేప‌థ్యంలో వివేకా హ‌త్య కేసులో వైఎస్ ష‌ర్మిలను […]

Written By: Srinivas, Updated On : February 20, 2022 2:11 pm
Follow us on

YS Sharmila: వైఎస్ వివేకానంద‌రెడ్డి హ‌త్య రోజుకో మ‌లుపు తిరుగుతోంది. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్ల‌డంతో మొద‌ట సాధార‌ణ మ‌ర‌ణంగా భావించిన కేసు హ‌త్య‌గా అనుమానం రావ‌డంతో కీల‌కంగా మారుతోంది. ప్ర‌తిప‌క్ష నేత‌లపై అనుమానాలు వ్య‌క్తం చేసినా త‌రువాత క్ర‌మంలో వైసీపీ నేత‌లే నిందితులుగా తేల‌డంతో వైసీపీ ప‌రువు కూడా పోతోంది. ఇన్నాళ్లు రెండు పార్టీలు నిందించుకున్న ప్ర‌స్తుతం వైసీపీ నేత‌ల మెడ‌కు చెట్టుకోవ‌డంతో ఎటూ తేల్చుకోలేక‌పోతోంది.

YS Sharmila

ఈ నేప‌థ్యంలో వివేకా హ‌త్య కేసులో వైఎస్ ష‌ర్మిలను కూడా ప్ర‌శ్నించాల‌ని ఆంధ్ర‌జ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. మొద‌టి నుంచి కూడా ఆర్కే ష‌ర్మిల‌ను సీబీఐ ఎందుకు ప్ర‌శ్నించ‌డం లేద‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. గ‌తంలో కూడా ష‌ర్మిల సీబీఐకి వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా సీబీఐనే ఎందుకు ఆమె వాంగ్మూలాన్ని తీసుకోలేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

దీంతో వివేకానంద రెడ్డి హ‌త్య కేసు విష‌యంలో వైసీపీ నేత‌లు సీబీఐని నిందిస్తున్నారు. కేసు విచార‌ణ‌లో తీసుకున్న నిర్ణ‌యాల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. మ‌రోవైపు కేసులో టీడీపీ నేత చంద్ర‌బాబు హ‌స్తం ఉంద‌ని చెబుతూ వారిని నిందిస్తున్న తీరు కూడా విమ‌ర్శ‌ల‌కు దారితీస్తోంది. వివేకా హ‌త్య‌కు ముందు క‌డ‌ప‌లో అయితే నేను లేక‌పోతే ష‌ర్మిల పోటీ చేస్తార‌ని ఆమె చెప్పిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమె వాంగ్మూలం తీసుకుంటే మంచిద‌నే అభిప్రాయం అంద‌రిలో వ‌స్తోంది.

Also Read: పవన్ కళ్యాణ్ రాజకీయం, సినిమాఇజం వేరప్పా..

వివేకా కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్క‌ర్ రెడ్డిలు నిందితులుగా తేల‌డంతో వారిని అరెస్టు చేస్తారా? లేదా? అనే అనుమానాలు అంద‌రిలో వ‌స్తున్నాయి. కేసులో సీబీఐ పురోగ‌తి సాధిస్తున్నా ప్ర‌భుత్వం మాత్రం సీబీఐకి ఎదురు త‌గులుతోంది. దీంతోనే కేసు ప్ర‌గతిలో ఉన్నా నిందితుల‌ను మాత్రం అదుపులోకి తీసుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆర్కే సూచించిన విష‌యం కూడా చ‌ర్చ‌నీయాంశం అవుతోంది.

దీంతో రాబోయే ఎన్నిక‌ల్లో వైసీపీకి క‌డ‌ప‌లో ఎదురుదెబ్బ‌లే త‌గ‌ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. వివేకా కూతురు సునీత కూడా టీడీపీలో చేరేందుకు నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. త‌న తండ్రి హ‌త్య‌లో పాల్గొన్న వారిపై క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేసే వ‌ర‌కు విశ్ర‌మించేది లేద‌ని చెబుతున్నారు. దీంతో రాజ‌కీయాలు కీల‌క మ‌లుపులు తిర‌గ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Also Read: ఆ ప్రాంతాల్లో కూడా స్టూడియోలు క‌ట్టాలంట‌.. జ‌గ‌న్ పెద్ద ప్లానే వేశారే..!

Recommended Video:

Tags