Optical Illusion Viral: టైమ్ పాస్ కావాలంటే ఒకప్పుడు ఏదైనా ఒక ఆట ఆడేవారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాను వెతుకుతున్నారు. ఎందుకంటే ఎక్కడా లేని కొత్త కొత్త వైరల్ వీడియోలు, ఫొటోలు, సంగతులు బోలెడన్ని విశేషాలు అన్నీ మనకోసం సిద్ధం చేసి ఉంచుతుంది ఈ సోషల్ మీడియా. ఇక సోషల్ మీడియా కూడా కొత్త కొత్త పుంతలు తొక్కుతోంది కస్టమర్ల కోసం. కాగా సోషల్ మీడియాలో ఈ మధ్య కొన్ని గేమ్స్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి.

మనందరికీ ఫజిల్ అనే గేమ్ తెలిసే ఉంటుంది. అయితే ఫజిల్ లో కూడా చాలా రకాలు ఉంటాయండోయ్. కొన్నేమో పేర్ల మీద ఉంటే.. మరికొన్ని మాత్రం ఆప్టికల్ ఇల్యూషన్ పేరు మీద ఉంటాయి. ఇది వినడానికి కొంచెం కొత్తగా అనిపించినా.. పాతదే. మన కంటికి పని చెప్పేదన్నమాట. అంటే ఈ గేమ్‌లో కంటికి కనిపించేది నిజం కాదు. లోపల వేరేది ఉంటుంది.
Also Read: షర్మిల సాక్ష్యమే కీలకమా?
వాస్తవంగా అక్కడున్న దాన్ని కనిపెట్టాలంటే చాలా కంటి చూపు ఉన్న వారితోనే సాధ్యం అవుతుంది. మీదకు చూడటానికి మొత్తం నల్లగా కనిపించినా.. అందులో ఒక నెంబర్ ఉంటుంది. దాన్ని కనిపెట్టాలంటూ సోషల్ మీడియాలో ఇలాంటి వైరల్ ఫొటోలు అనేకం వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు కూడా ఇలాంటి వైరల్ పిక్ ఒకటి నెట్టింట్లో బాగా హల్ చల్ అవుతోంది. అదేంటో చూద్దాం.
ఈ వైరల్ ఫొటోను @benonwine ID ఖాతాలో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అయితే ఇందులో ఒక నంబర్ ఉంది. అది మామూలుగా చూస్తే అస్సలు కనిపించదు. కానీ కొంచెం పరీక్షగా చూస్తే అందులో ఉన్న 3452839 అనే నెంబర్ కనిపిస్తుంది. చాలామంది దాన్ని 528 అని అనకుని రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఇప్పటి వరకు ఆన్సర్ చెప్పిన వారిలో 99శాతం మంది ఫెయిల్ అయ్యారంట. మరి మీ కంటి పవర్ ఏంటో ఒకసారి దాన్ని చూసి చెప్పండి.
Also Read: ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై దుమారం? మంగళ్ హాట్ పీఎస్ లో ఎఫ్ ఐఆర్ నమోదు
Recommended Video:
