రూ.300 కోట్లు టు రూ.1200 కోట్లు.. కేసీఆర్ ఆడింది ఆట?

కర్రవిరగకుండా పాము చచ్చేలా కేసీఆర్ రాజకీయం చేస్తుంటారు. చాకచక్యంగా పనులు చేపట్టడంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెట్టడం.. దానికి ఇంత అని ఎస్టిమేట్‌ వేయడం.. తర్వాత సరిపోవడం లేదంటూ అంచనాలు పెంచేస్తుంటారు.. అటు ప్రాజెక్టులు కానీ.. తాజాగా సచివాలయం విషయంలో కానీ కేసీఆర్‌‌ అమలుచేసిన మైండ్‌ గేమ్‌ అందరికీ అర్థమయ్యే ఉంటుంది. Also Read: మాటల కోటలు.. చర్యలేవి కేసీఆర్ సార్ సచివాలయం నిర్మాణానికి రూ.1200 […]

Written By: NARESH, Updated On : September 11, 2020 12:03 pm
Follow us on

కర్రవిరగకుండా పాము చచ్చేలా కేసీఆర్ రాజకీయం చేస్తుంటారు. చాకచక్యంగా పనులు చేపట్టడంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెట్టడం.. దానికి ఇంత అని ఎస్టిమేట్‌ వేయడం.. తర్వాత సరిపోవడం లేదంటూ అంచనాలు పెంచేస్తుంటారు.. అటు ప్రాజెక్టులు కానీ.. తాజాగా సచివాలయం విషయంలో కానీ కేసీఆర్‌‌ అమలుచేసిన మైండ్‌ గేమ్‌ అందరికీ అర్థమయ్యే ఉంటుంది.

Also Read: మాటల కోటలు.. చర్యలేవి కేసీఆర్ సార్

సచివాలయం నిర్మాణానికి రూ.1200 కోట్లు అవుతాయని ముందుగానే చెబితే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని భావించారేమో కేవలం 300 కోట్లకే కేసీఆర్ మొదట పరిమితం చేశారు. కానీ.. నిర్మాణ ఖర్చు మాత్రం నాలుగు రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయి.

తెలంగాణ ప్రభుత్వం మొదట్లో చెప్పిన లెక్కలకు.. ఇప్పుడు నడుస్తున్న తంతుకు పొంతన లేదంటున్నారు. కనీసం ఒక ఇటుక కూడా వేయకుండానే ఎస్టిమేషన్ అమాంతం రూ.700 కోట్లకు చేరింది. ఈ రూ.700 కోట్లు కూడా కేవలం సివిల్ వర్క్‌కే. పార్కులు, ఇన్నర్ రోడ్లు, హెలిప్యాడ్ వంటి ఇతర నిర్మాణాలకు ఖర్చు అదనం అవుతున్నాయి. అలాగే ఇంటీరియర్ వర్క్ ఖర్చు కూడా భారీగానే ఉంటుందని, అయితే సివిల్ వర్క్‌ పూర్తయ్యాకే దాని మీద క్లారిటీ వస్తుందని అంటున్నారు. పూర్తయ్యే నాటికి 1,200 కోట్లకు చేరే అవకాశాలూ ఉన్నాయి.

ప్రస్తుతం తెలంగాణలో బలమైన ప్రతిపక్షం లేదు. అందుకే కేసీఆర్‌‌ ఆడిందే ఆటగా మారిపోయింది. అటు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా 80 లక్షల కోట్లు అని మొదలు పెట్టి ఇప్పుడు ఏ స్థాయికి పెంచారో అందరికీ తెలిసిందే. ఇంత జరుగుతున్నా అడపాదడపా వాయిస్‌ వినిపించడం తప్ప ప్రతిపక్షాలు పెద్దగా పట్టించుకున్నది లేదు.

Also Read: తెలంగాణ లంచావతారుల మీద అనకొండలు

గత 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు అధికారంలో ఉండగా జగన్‌ దీటైన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ అధికారంలోకి రావడానికి కూడా నాడు చంద్రబాబు కట్టిన తాత్కాలిక సచివాలయం ఎంతగానో దోహద పడిందని రాజకీయ వర్గాల్లో టాక్‌. తెలంగాణలో మాత్రం కేసీఆర్ వైఫల్యాలను అందిపుచ్చుకోవడంలో ప్రతిపక్ష కాంగ్రెస్ విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.