ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. టీడీపీని నీరుగార్చే ప్రయత్నాలను పెద్ద ఎత్తున చేస్తోందన్న టాక్ వినిపిస్తోంది. ఓ పద్ధతిగా తెలుగు దేశం పార్టీ మాజీ మంత్రులను బుక్ చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఓ వైపు సంక్షేమ పథకాలతో తన స్థానాన్ని ప్రజల్లో సుస్తిరం చేసుకుంటూనే మరోవైపు టీడీపీ పునాదులు కూల్చేపనిలో జగన్ బిజీగా ఉన్నాడంటున్నారు.
Also Read : కనగరాజ్ తోపాటు ఓ సామాన్యుడిని బలి చేసిన జగన్?
తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఇప్పటికే ఈఎస్ఐ స్కాంలో బుక్ చేసిన సీఎం జగన్ సర్కార్.. అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డిని కటకటాల పాలు చేశారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను హత్య కేసులో అరెస్ట్ చేసింది.
టీడీపీ ఎమ్మెల్యేలు, సీనియర్లు వరుసగా అరెస్టులు అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆస్తులు కాపాడుకోవడానికి కొందరు.. అధికార బలం కోసం మరికొందరు వైసీపీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం చంద్రబాబుకు తలకుమించిన భారమవుతోంది. ఇప్పటికే నలుగురైదుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీకి సపోర్టుగా నిలుస్తున్నారు. కుదేలవుతున్న టీడీపీకి, చంద్రబాబు నాయుడుకు సహాయం చేయడానికి కొంతమంది ఆయన పాత సన్నిహితులు రంగంలోకి దిగారట.. ఈ మేరకు ప్రయత్నాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్టు టాక్ నడుస్తోంది.
Also Read : మూడు రాజధానులపై తేల్చేసిన కేంద్రం
ప్రస్తుతం టీడీపీని బతికించేందుకు ఒకప్పుడు చంద్రబాబు రైట్ హ్యాండ్ గా ఉన్న ఎంపీ ప్రయత్నిస్తున్నాడని సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఏడాది క్రితం పార్టీ మారిన ఆ ఎంపి ఈ మేరకు లాబీయింగ్ మొదలుపెట్టాడట.. టీడీపీని వీడి వైసీపీలో చేరడానికి సిద్ధమైన టీడీపీ ఎమ్మెల్యేను కప్పదాటకుండా కాపు కాస్తున్నాడట.. టీడీపీలోనే ఉంచడానికి, వైసిపిలోకి దూకకుండా ఉండేందుకు భారీ ఆఫర్ ను కూడా ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. రెండోసారి గెలిచిన ఆ టిడిపి ఎమ్మెల్యేకు సదురు ఎంపీ ఏకంగా రూ .3 కోట్లు ఇచ్చాడని టాక్ నడుస్తోంది.
మరి చంద్రబాబు పరువు కాపాడాలని ఆ సదురు ఎంపీ ఇంత మొత్తం ఇవ్వడంతో టిడిపిలోనే ఉండాలా, వైసిపిలో చేరాలా అనే విషయంపై ఎమ్మెల్యే కొన్ని వారాల నుంచి అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతున్నాడట.. ఆ ఎంపి తన ప్రయత్నాలు గట్టిగా చేస్తూ ఎమ్మెల్యేను పార్టీ మారకుండా అడ్డుగా నిలుస్తున్నాడట.. మరి సదురు టీడీపీ ఎమ్మెల్యే.. రూ.3కోట్ల ఆఫర్‌ను తిరస్కరించి వైసీపీలో చేరుతారా?, డబ్బులకు లొంగి టీడీపీలోనే ఉంటాడా? అన్నది ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఆ నోటా ఈ నోటా బయటపడుతోంది.
Also Read : సర్కార్ దమనీతిపై బీజేపీ–జనసేన ధర్మపోరాటం