ఉపవాసం ఉండడం మంచికా.. చెడుకా..?

సోమవారం శివుడికి… మంగళవారం ఆంజనేయుడికి… శనివారం వేంకటేశ్వరస్వామికి… ఇలా వారంలో ఏదో ఒక రోజున ఉపవాసం ఉంటారు కొందరు. దేవుని కోసం ఉపవాసం ఉండేవారు కొందరయితే… పెరిగిన కొవ్వుని కరిగించుకోవడానికి ఉపవాసాన్ని పాటించే వారు ఇంకొందరు. ఇక సైజు జీరో ట్రెండ్ మొదలయ్యాక ఫాస్టింగ్ ఓ ఫాషన్ లా మారిపోయింది. ఎంత తక్కువ ఆహారం తింటే అంత అందంగా.. ఆకర్షణీయంగా ఉంటామని వీరి ఫీలింగ్. కాని నిజానికి ఉపవాసం ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని […]

Written By: NARESH, Updated On : September 10, 2020 5:49 pm

fastings

Follow us on

సోమవారం శివుడికి… మంగళవారం ఆంజనేయుడికి… శనివారం వేంకటేశ్వరస్వామికి… ఇలా వారంలో ఏదో ఒక రోజున ఉపవాసం ఉంటారు కొందరు. దేవుని కోసం ఉపవాసం ఉండేవారు కొందరయితే… పెరిగిన కొవ్వుని కరిగించుకోవడానికి ఉపవాసాన్ని పాటించే వారు ఇంకొందరు. ఇక సైజు జీరో ట్రెండ్ మొదలయ్యాక ఫాస్టింగ్ ఓ ఫాషన్ లా మారిపోయింది. ఎంత తక్కువ ఆహారం తింటే అంత అందంగా.. ఆకర్షణీయంగా ఉంటామని వీరి ఫీలింగ్. కాని నిజానికి ఉపవాసం ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read: కరోనా ఎఫెక్ట్: పెరుగుతున్న లైంగిక సమస్యలు

ఉపవాసం పేరిట ఆకలిని చంపుకోవడం.. కడుపుని పూర్తిగా ఖాళి చేయడం మంచిది కాదు. సమయానికి ఆకలవుతుందంటే మీ జీర్ణ వ్యవస్థ చురుకుగా పని చేస్తుందని అర్ధం. ఆ సమయంలో తినకుంటే చేజేతులారా సమస్యలను కొని తెచ్చుకున్నట్లే అంటున్నారు నిపుణులు.

+ఆకలి విషయంలో పాటించాల్సిన కొన్ని ఆరోగ్య సూచనలు:
* ఆకలేసినప్పుడే తినడం మంచిది. ఆకలి మరీ పెరిగిపోయదాక ఎదురుచూడడం…. లేదా ఆకలేయకముందే లాగించేయడం లాంటివి చేయకూడదు. రోజు ఒకే సమయంలో తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.

* పెళ్ళికో, పార్టీకో వెళ్ళినప్పుడు.. అక్కడ దొరికే చిరు తిండి తినడం మంచిది కాదు. సరైన భోజనం కోసం కొంత ఎదురు చూసినా పరవాలేదు.

* పొద్దున్నే లేచి రాత్రి వరకు కష్టపడాలంటే మన శరీరానికి తగినంత ఛార్జింగ్ కావాలి.. కాబట్టి బ్రేక్‌-ఫాస్ట్‌ భారీగా చెయ్యాలి. మధ్యాహ్న భోజనం తక్కువగా తినాలి. రాత్రి దాదాపు 8 గంటలు మన బాడీకి రెస్ట్ ఇస్తాం కాబట్టి డిన్నర్ మాత్రం ఏమి లేనివాడిలా తినాలి. అలగని ఏమి తినకుండా నిద్రించకూడదు.

* భోజనంతో పాటు సాఫ్ట్‌ డ్రింక్స్‌ జ్యూస్‌ లాంటివి తీసుకోకూడదు. భోజనం సమయంలో వీలైనంతగా నీళ్లు కూడా తాగకూడదు. భోజనం పూర్తయ్యాకే వెచ్చని నీళ్లు తాగాలి.

Also Read: బీర్‌‌ తాగితే రెచ్చిపోవుడేనట?

* మటన్‌, చికెన్‌ వంటి మాంసాహారం తీసుకుంటూ ఉంటే… దానితో పాటు వీలైనంతగా ఉడికించిన కూరగాయలు, పండ్లు తినాలి. ఫాస్ట్ ఫుడ్ కు వీలైనంత దూరంగా ఉండాలి.

* ఆకలి తీరినట్లు అనిపించగానే తినడం ఆపేయడం మంచిది. భోజనం రుచిగా ఉందని… లేక మొహమాటానికో ఎక్కువగా తింటే.. దాని వల్ల వచ్చే అనర్థాలు ఎన్నో ఉంటాయి.

* మన డైలీ లైఫ్ లో ఎంత బిజీగా ఉన్నా భోజనం మాత్రం సమయానికి తినాలి. రాత్రుళ్లు చాలాసేపు ఆగాల్సి వస్తే చిరు తిండ్లకు బదులుగా దోసముక్కలు, క్యారట్‌ ముక్కలు, టొమాటో ముక్కలు వంటి గ్రీన్ సలాడ్స్‌ తీసుకోవాలి.