MLA Roja: చిత్తూరు జిల్లా నగరిలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. ఎమ్మెల్యే రోజాకు స్థానిక నేతలకు కొద్ది రోజులుగా పడటం లేదు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదలైన విభేదాలు తారాస్థాయికి చేరాయి. రోజాపై బహిరంగంగానే ఎలా గెలుస్తావో చూస్తామని సవాల్ విసురుకున్న సంఘటనలు ఉన్నాయి. దీంతో ఎమ్మెల్యే రోజా వారి పట్ల అసంతృప్తితోనే ఉన్నట్లు తెలుస్తోది. కానీ అక్కడి నేత చక్రపాణి రెడ్డికి ప్రభుత్వం శ్రీశైలం దేవస్థాన బోర్డు చైర్మన్ పదవి అప్పగించడంపై రోజా కలత చెందారు. తనకు గిట్టని వారికి పదవులు కట్టబెట్టడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీంతో నగరి రాజకీయాలు మరోమారు విభేదాలకు కేంద్రంగా మారనున్నట్లు తెలుస్తోంది.
అసవరమైతే సీంఎ జగన్ ను కలిసి పరిస్థితి వివరిస్తానని రోజా చెబుతున్నారు. తనకు తెలియకుండా చక్రపాణి రెడ్డికి పదవి ఇవ్వడంపై మండిపడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో రోజా చక్రపాణిరెడ్డి మధ్య గొడవలు జరిగాయి. దీంతో రోజా వారితో మాట్లాడటం లేదు. కానీ ప్రస్తుతం ఆయనకు పదవి కేటాయించడంతో రోజా తట్టుకోలేకపోతోంది. తనకు కాని వారికి పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి రాజకీయ దుమారం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ కోసం పనిచేసేతనను కాదని గిట్టని వారికి పదవులు ఎలా ఇస్తారని వాదిస్తున్నారు.
చక్రపాణి రెడ్డినే కొనసాగించాలనుకుంటే తాను పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమనే అభిప్రాయాన్ని కార్యకర్తల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. రాజకీయ పబ్బం గడుపుకోవాలని రాజకీయాల్లోకి రాలేదని పార్టీ ప్రతిష్ట కోసమే తాను పనిచేస్తున్నానని చెబుతున్నారు. ఒక వర్గం తనపై కావాలనే గొడవలకు దిగుతోందని పలుమార్లు వ్యాఖ్యానించినట్లు తెలిసిందే. దీంతో చిత్తూరు జిల్లాలో వైసీపీలో మరింత దూరం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read: చలో విజయవాడకు పోలీసులు కూడా సాయం చేశారా?
వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా పేరుతెచ్చుకున్న రోజాకు రాజకీయాలు కొత్తేమీ కాదు. ఇదివరకు టీడీపీలో కూడా తన సత్తా చాటారు. దీంతో తన మాట నెగ్గకపోతే దేనికైనా సిద్ధమేనని బహిరంగంగానే వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రోజా మాటకు సీఎం జగన్ ఏమేరకు విలువ ఇస్తారో తెలియడం లేదు. చక్రపాణి రెడ్డిని కొనసాగిస్తారా? లేక రోజా మాటకు ప్రాధాన్యం ఇచ్చి పదవి నుంచి తప్పిస్తారా? అనేదే తేలాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీలో ఇప్పటికే జిల్లాల ఏర్పాటు తలనొప్పి ఉండగానే మరో పెంట అంటించుకోవడంపై అందరిలో అనుమానాలు వస్తున్నాయి.
వైసీపీలో కొనసాగుతున్న విభేదాలను జగన్ పరిష్కరిస్తారా? లేక పెండింగులో పెడతారా? అనే సంశయాలు వస్తున్నాయి. మరోవైపు ఇంకో రెండేళ్లలో జరిగే ఎన్నికలకు సిద్ధమవుతున్న జిగన్ ఇప్పుడు ఇన్ని సమస్యలు తెచ్చుకోవడం అవసరమా అనే వాదనలు కార్యకర్తల్లో వస్తున్నాయి. పార్టీని గాడిలో పెట్టాల్సింది పోయి విభేదాల నడుమ అంట కాగుతున్నారని తెలుస్తోంది. ఇది కచ్చితంగా రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.
Also Read: బీజేపీకి భయపడని కేసీఆర్.. జగన్‌కు భయమా?