Homeఎంటర్టైన్మెంట్Chatrapati Sureedu: చత్రపతి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

Chatrapati Sureedu: చత్రపతి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా?

Chatrapati Sureedu: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తుంటారు. ఇలా ఇండస్ట్రీలోకి వచ్చిన చైల్డ్ ఆర్టిస్ట్ లు ఆ తర్వాత పై చదువుల నిమిత్తం కొన్ని రోజుల పాటు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ అనంతరం తిరిగి హీరోలుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. ఇలా ఎంతో మంది హీరో హీరోయిన్లు ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉన్నారు. మరికొందరు వారికి ఇష్టమైన వృత్తిలో స్థిరపడిపోయారు. ఇలా చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో చత్రపతి సూరీడు ఒకరు.

Chatrapati Sureedu
Chatrapati Sureedu

రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం చత్రపతి. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ ను ఎంతో హైలెట్ చేసే పాత్ర సూరీడు పాత్ర. ఈ పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్‌ భశ్వంత్‌ వంశీ పాత్రను జనాలు ఎప్పటికీ మరిచిపోలేరు. అయితే ప్రస్తుతం ఇతను ఎంతో పెద్దగా మారిపోయాడు. అయితే ప్రభాస్ సినిమా ఆడిషన్స్ కోసం వెళ్ళినప్పుడు సుమారు 100 మంది వెళ్ళారు. కానీ రాజమౌళి మొదటి రౌండ్ లోనే ఇతనిని సెలెక్ట్ చేశారు.

ఈ పాత్రకు 100% న్యాయం చేయగలరని భావించిన జక్కన్న ఏమాత్రం లెక్క తప్పకుండా అంతకుమించి సూరీడు పాత్రకు భశ్వంత్‌ వంశీ న్యాయం చేశారని చెప్పవచ్చు. ఇక ప్రస్తుతం ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఎంతో పెద్దగా మారిపోయారు.ఈ క్రమంలోని ఇతని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇతని ఫోటోలు చూసిన నెటిజన్లు చత్రపతి సూరీడా ఇక్కడా.. అంటూ ఎంతో ఆశ్చర్యపోతున్నారు. మరింకేందుకు ఆలస్యం.. చిన్నప్పటి సూరీడు ఇప్పుడు ఎలా ఉన్నారో మీరు ఓ లుక్కేయండి!

Also Read: “ప్రాజెక్ట్ K” సెట్స్‌లో అడుగుపెట్టబోతున్న డార్లింగ్

ఎవరు మీలో కోటీశ్వరులు షో లో పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన తారక్

ఛత్రపతి లో సూరీడు ఇప్పుడు.. || Chatrapathi Movie Child Artist Suridu Now | OkTelugu Entertainment

 

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Exit mobile version