కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ దూకుడు పెంచారు. విపక్షాల ఆరోపణలకు తావివ్వకుండా ఇకపై అన్ని వ్యవహారాలు తానే చూసుకునేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి నియామకం, పంజాబ్ లో సిద్దూ కు పీసీసీ పీఠం, రాజస్థాన్ లో సీఎం అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య సయోధ్య తదితర విషయాలపై తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి పార్టీలకు సవాలుగా నిలుస్తోంది.
పలు స్టేట్లలో సీనియర్ నేతల మధ్య వివాదాలే చోటుచేసుకుంటున్నాయి. ఇన్నాళ్లు పార్టీని పట్టించుకోకపోవడంతో పలు ఆరోపణలకు కేంద్ర బిందువైంది. దీంతో పలువురు పలు విధాలుగా నిందించేందుకు కారణమైంది. ఫలితంగా మధ్యప్రదేశ్ లో ప్రభుత్వాన్ని చేజేతులారా పోగొట్టుకున్నారు. మాజీ సీఎం కమల్ నాథ్ జ్యతిరాధిత్య సింధియా మద్య విభేదాలు పెరిగిపోయి చివరకు ప్రభుత్వమే మారిపోయింంది.
ఇన్నాళ్లు ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నా పార్టీ విధానాలతో వారికి దూరమయ్యారు. ఈ మధ్య రాహుల్ గాంధీ రాకతో బిహార్, బెంగాల్, తమిళనాడు, కేరళ ఎన్నికల్లో తెలిసింది. దీంతో ప్రధాని నరేంద్ర మోడీపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
దేశంలో బీజేపీ పరిస్థితి ఎలా ఉంది. కాంగ్రెస్ పార్టీ స్థితి ఏ విధంగా తయారైంది అనే విషయాలపై పీకే లెక్కలతో సహా వివరించారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేసినట్లు సమాచారం. మోడీ వ్యతిరేక పార్టీలన్ని కాంగ్రెస్ పార్టీ మూడో కూటమికి సారధ్యం వహించాలన్న మోడీ వ్యతిరేక పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. బిహార్ లో తేజస్వీ యాదవ్, బెంగాల్ లో మమత బెనర్జీ లాంటి వాళ్లు ఈ విషయంపై తమ అంతరంగాన్ని ఆవిష్కరించారు.
ఇకపై పార్టీ వ్యవహారాలను తానే చూసుకుంటానని రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే పంజాబ్ లో వివాదాలపై దృష్టి సారించారు. వృద్ధులను పక్కన పెట్టి యువతకు పెద్దపీట వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. పీకే ఆదేశాల మేరకే రాహుల్ గాంధీ పార్టీని విజయతీరాలకు చేర్చాలని నిర్ణయించుకున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి.