https://oktelugu.com/

మద్యం ప్రియులకు ముచ్చెమటలు పట్టించిన న్యూస్ ఇదే..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ న్యూస్ మద్యంప్రియులను ముచ్చెమటలు పట్టించింది. ముఖ్యంగా బీర్లను ఇష్టంగా సేవించేవారికి మాత్రం ఇది నిజంగా షాకింగ్ వార్తే.. అయితే చివర్లో ఓ చిన్న ట్వీట్ కూడా ఉంది. మద్యంప్రియులను అంతలా భయాందోళనకు గురిచేసిన వార్తంటో మనం కూడా ఓసారి చూద్దామా..! ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్ బీర్లు తయారుచేసే కంపెనీలో ఓ ఉద్యోగి 12ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆ వ్యక్తికి బద్ధకం ఎక్కువ. దీంతో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 2, 2020 / 07:51 PM IST
    Follow us on


    ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓ న్యూస్ మద్యంప్రియులను ముచ్చెమటలు పట్టించింది. ముఖ్యంగా బీర్లను ఇష్టంగా సేవించేవారికి మాత్రం ఇది నిజంగా షాకింగ్ వార్తే.. అయితే చివర్లో ఓ చిన్న ట్వీట్ కూడా ఉంది. మద్యంప్రియులను అంతలా భయాందోళనకు గురిచేసిన వార్తంటో మనం కూడా ఓసారి చూద్దామా..!

    ఈ ఒక్క పనితో జాతీయస్థాయిలో హీరో అయిన జగన్

    బీర్లు తయారుచేసే కంపెనీలో ఓ ఉద్యోగి 12ఏళ్లుగా పని చేస్తున్నాడు. ఆ వ్యక్తికి బద్ధకం ఎక్కువ. దీంతో సదరు ఉద్యోగి బీర్ల తయారీకి ఉపయోగించే ట్యాంకులోనే మూత్రం పోస్తున్నాడట. ఈ వ్యవహారం అంతా 12ఏళ్లుగా సాగుతోందట. ఆ వ్యక్తి పని చేసిది బడ్వైజర్(Budweiser) బ్రేవరీలోనట. ఒకసారి తన ఫ్రెండ్స్ బడ్వైజర్ బీరు తాగుతుంటే ఆ ఉద్యోగికి జాలిసిందట. దీంతో తాను బద్దకంతో బీరు ట్యాంకులో మూత్రం పోస్తున్న విషయం వారికి చెప్పాడట. దీంతో వారంతా షాకయ్యారు.

    జగన్ ని తిట్టే బాధ్యత పవన్ ఎలా నెరవేర్చుతాడో?

    ఇక నుంచి తాను అలాంటి తప్పు చేయబోనని ఫ్రెండ్స్ కు ప్రామీస్ చేశాడు. అంతేకాకుండా తన యజమాని తనపై చాలా నమ్మకం పెట్టుకున్నాడని ఇక బీరు ట్యాంకులో మూత్రంపోయనని వారికి హామీ ఇచ్చాడట. అప్పటి నుంచి ఆ ఉద్యోగి బీరు ట్యాంకులో మూత్రం లేకుండా కేవలం నీటితో నింపుతున్నాడట. ఊహించని విధంగా అతడు అందరికీ షాకివ్వడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో గతంలో బడ్వైజర్ బీర్లు తాగిన వాళ్లంతా.. వాడు పోసిన బీరేనా ఇన్నిరోజులు తాగింది అంటూ తలలు పట్టుకున్నారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

    అయితే ఇదంతా కల్పితమని.. జస్ట్ ఫర్ ఫన్ కోసమేనని.. సదరు వెబ్ సైట్ ఈ కథనం చివర్లో ప్రచురించడంతో మద్యంప్రియులంతా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ షాక్ నుంచి కోలుకున్నాక మద్యంప్రియులు, నెటిజన్లు ఆ వార్తను సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ చేస్తున్నారు. ఒకరిపై ఒకరు జోక్సు వేసుకుంటూ.. ఈ వార్తను షేర్ చేసుకుంటూ మద్యంప్రియులు చీర్స్ చెబుతుండటం గమనార్హం.