Pawan Kalyan Shramadanam: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానం కార్యక్రమం సజావుగా సాగేనా అనే అనుమానాలు వస్తున్నాయి. అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా ఉన్న రోడ్ల దుస్థితిపై దృశ్యాలను సైతం ప్రదర్శించినా ప్రభుత్వంలో చలనం రాలేదు. దీంతో వాటిని మరమ్మతు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీనికిగాను దవళేశ్వరం, అనంతపురం జిల్లాలను వేదికగా చేసుకున్నారు. రెండు చోట్ల మరమ్మతులు చేపట్టి బహిరంగ సభ నిర్వహించాలని ప్రణాళిక సిద్ధం చేసుకోగా పోలీసులు అనుమతి నిరాకరిస్తున్నారు. దీంతో సభలు జరిపి తీరుతామని జనసేన సైనికులు చెబుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో సంక్షేమ పథకాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. దీంతో అభివృద్ధి కార్యక్రమాల ఊసే లేకుండా పోతోంది. దీంతో ప్రతిపక్షాలు గోల చేస్తున్నా పట్టించుకోవడం లేదు. నగదు బదిలీ వేదికగా డబ్బులన్నీ ప్రజలకు చేరడంతో అసలు పనులే లేకుండా పో యాయి. టీడీపీ ఎన్నో రోజులుగా మొత్తుకుంటున్నా అభివృద్ధి పనుల ఊసు కనిపించడం లేదు. దీంతో రాష్ర్టంలో పనులు కొనసాగడం లేదు.
గతంలోనే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాష్ర్టంలో రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వానికి సూచిచంినా పట్టించుకోలేదు. నాలుగు వారాల గడువు ఇచ్చి మరమ్మతులు చేపట్టాలని చెప్పినా నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రోడ్ల మరమ్మతు చేపట్టాలని నిర్ణయించి పార్టీ తరఫున చేపట్టాలని భావించారు. ఇందుకు గాను పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
కానీ పవన్ కళ్యాణ్ చేపట్టే మరమ్మతు కార్యక్రమాలను సజావుగా సాగేందుకు వైసీపీ నేతలు ఇష్టపడటం లేదని తెలుస్తోంది. జనసేన నేతలను అడ్డుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దవళేశ్వరం, అనంతపురం జిల్లాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనే సభలకు పోలీసులు అనుమతి లేదని నిరాకరించడంతో పవన్ కల్యాణ్ ప్రోగ్రామ్ ల నిర్వహణపై సందేహాలు నెలకొన్నా్యి.