Basmati Rice: శుభకార్యాలలో, ప్రత్యేకమైన సందర్భాలలో బాస్మతి బియ్యాన్ని ఎక్కువగా వినియోగిస్తామనే సంగతి తెలిసిందే. ఈ బియ్యం సహాయంతో నోరూరించే వంటకాలను తయారు చేసుకుంటూ ఉంటాం. సాధారణ బియ్యంతో పోలిస్తే బాస్మతి బియ్యం ఆరోగ్యానికి ఎంతో మంచివి. వైట్ బాస్మతి, బ్రౌన్ బాస్మతి అనే రెండు రకాలలో ఈ బియ్యం లభిస్తాయి. ఈ బియ్యం చక్కటి రుచితో పాటు సువాసనను సైతం కలిగి ఉంటాయి.

బ్రౌన్ బాస్మతి బియ్యంలో తెల్లటి బియ్యంతో పోలిస్తే పిండి పదార్థం ఎక్కువగా ఉండటంతో పాటు వేర్వేరు రకాల బీ విటమిన్లు ఉంటాయి. సాధారణ బియ్యంతో పోలిస్తే ఈ బియ్యంలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బ్రౌన్ బాస్మతి రైస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మామూలు బ్రౌన్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ బాస్మతి రైస్ ను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ ను నియంత్రించే అవకాశం అయితే ఉంటుంది.
సాధారణంగా వినియోగించే బియ్యంతో పోలిస్తే ఈ బియ్యం మెరుగైన బియ్యం అని చెప్పవచ్చు. అయితే సాధారణ బియ్యంతో పోలిస్తే వీటి ఖరీదు ఎక్కువ కావడం గమనార్హం. జీరా రైస్, కిచిడీ, ఫలావ్, బిర్యానీ తినేవాళ్లు వండుకోవడానికి బాస్మతి బియ్యం వినియోగిస్తే మంచిది. హోటళ్లు, రెస్టారెంట్లలో బిర్యానీ తయారీ కోసం ఎక్కువమంది బాస్మతి రైస్ ను వినియోగిస్తారు.
బాస్మతి బియ్యాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకునే అవకాశం కూడా ఉంటుంది. బాస్మతి రైస్ తినడం వల్ల శరీరంలో కొవ్వు చేరదు. బాస్మతి బియ్యంతో వండిన ఆహారం తేలికగా జీర్ణమయ్యే అవకాశం ఉంటుంది. బాస్మతి బియ్యం తేలికగా ఉండటంతో పాటు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.