Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోమారు దీక్ష చేశారు. ఈ సారి మాత్రం రెండు విషయాలపై స్పష్టత ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీని దూరం చేయాలని భావిస్తున్నారు. రెండోది మాత్రం టీడీపీకి అనుకూలమనే సంకేతాలు మాత్రం ఇచ్చారు. దీంతో రాష్ర్టంలో ఏం జరుగుతుందనే దానిపై మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలో జనసేన ప్రత్యామ్నాయం అవుతుందని చెబుతున్నారు. జగన్ ను అధికారానికి దూరం చేస్తేనే రాష్ర్టం బాగుపడుతుందని ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కూడా స్టేట్ దే తప్పు అని చెబుతున్నారు. కేంద్రాన్ని వ్యతిరేకించడంలో వైసీపీ నిర్లక్ష్యం చేసిందని తెలుస్తోంది. రాష్ర్టంలో జరిగే పరిణామాల్లో అధికార పార్టీదే బాధ్యత. అందుకే ప్రజా వ్యతిరేక విధానాలు అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. దీనికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది.
మరోవైపు జనసేన ప్రజాసమస్యల పరిష్కారంలో ముందుంటుంది. అధికార పార్టీ దురాగాతాలను ఎండగడుతోంది. దీనికి గాను పటిష్ట ప్రణాళిక సిద్ధం చేయనున్నట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీని అంతం చేయడమే తమ మార్గంగా కనిపిస్తోంది. టీడీపీతో మాత్రం పొత్తు ఉంటేందనే విషయం పరోక్షంగా సంకేతాలు పంపారు. దీంతో పవన్ కల్యాణ్ మనోభావాలు వెల్లడించారు.
Also Read: AP CM Jagan: జగన్ కు ప్రాణభయం పొంచి ఉందట?
వైసీపీ విధానాలతో ప్రజలు విసిగి వేసారుతున్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభిస్తూ నిర్లక్ష్యంగా వహిస్తోంది. దీంతో ప్రజల్లో అసహనం పెరిగిపోతోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో వైసీపీని అధికారంలోకి రానీయకుండా చేయాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. వైసీపీలో చోటుచేసుకుంటున్న నిర్ణయాలతో ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దీనిపై పవన్ కల్యాణ్ తనదైన శైలిలో పలు విషయాలు వివరించారు.
Also Read: Padayatra: తుది అంకానికి చేరుకున్న ‘మహాపాదయాత్ర’.. ఉత్కంఠ?