India: భారత్ ముందు పాకిస్తాన్ మోకరిల్లిందా?

India: సాధారణంగా, పాకిస్తాన్ రాజకీయాలు భారతదేశాన్ని ప్రస్తావించకుండా సాగవు. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం అక్కడి నాయకులకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు పాత అలవాటు.

Written By: NARESH, Updated On : May 30, 2024 8:57 pm

India

Follow us on

India: సాధారణంగా, పాకిస్తాన్ రాజకీయాలు భారతదేశాన్ని ప్రస్తావించకుండా సాగవు. భారతదేశానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేయడం అక్కడి నాయకులకు ఎప్పటి నుంచో ఉన్న అలవాటు పాత అలవాటు. అయితే నవాజ్ షరీఫ్ ప్రకటనతో పాక్‌ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వారిలో భారతదేశం పట్ల గౌరవం పెరిగినట్లు కనిపిస్తోంది. తమ గత తప్పులను ఒప్పుకుంటున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ పై కేసు నమోదైంది. 25 ఏళ్ల తర్వాత, లాహోర్ డిక్లరేషన్‌ను పాకిస్థాన్ ఉల్లంఘించిందని అంగీకరించాడు. ఈ మేనిఫెస్టో రెండు దేశాల మధ్య శాంతి, సుస్థిరతలకు హామీ ఇచ్చింది. అయితే ఏడాదిలోపే పాకిస్థాన్ ఈ హామీని తుంగలో తొక్కింది. తనను తాను దోషిగా పరిగణించడం గమనార్హం.

నవాజ్ షరీఫ్ ఆంతర్యం ఏమిటి?
వాస్తవానికి భారతదేశం-పాకిస్తాన్ సంబంధాల్లో హెచ్చు తగ్గులున్నాయి. కొన్నిసార్లు రెండు దేశాలు అణు విస్ఫోటనాలతో ఒకరినొకరు సవాల్ విసురుకున్నారు. అయితే ఆ తర్వాత కార్గిల్‌లో పరిస్థితి యుద్ధ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ కూడా నరేంద్ర మోదీని పొగిడేలా, వాజ్ పేయి కాలంలోని తప్పులను నవాజ్ షరీఫ్ కూడా అంగీకరించే పరిస్థితి వచ్చింది.  పాకిస్తాన్ ప్రస్తుతం  అనేక రంగాల్లో బలహీనపడింది.  ఆ దేశం ఇప్పుడు  అప్పుల ఊబిలో కూరుకుపోయింది.  ఏ ఉగ్రవాదులనైతే పెంచి పోషించిందో వారే ఇప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  ఆర్థికంగా అండగా నిలిచిన అమెరికా కూడా పాకిస్తాన్ ను దూరం పెడుతూ వస్తున్నది.

మారిన ఫార్మూలా
ఒకప్పుడు మూడు ‘A’లు  అంటే అమెరికా, ఆర్మీ..  అల్లా – పాకిస్తాన్‌ను  నడిపాయి. ఇప్పుడు ఆ మూడే పాకిస్తాన్ కు ప్రతికూలంగా మారాయి. భారత్‌తో పాక్ కుదుర్చుకున్న లాహోర్ డిక్లరేషన్‌-1999ను ఇస్లామాబాద్ ఉల్లంఘించిందని పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంగీకరించారు. కార్గిల్‌లో జనరల్ పర్వేజ్ ముషారఫ్ జరిపిన దాడిని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పాకిస్థాన్ కార్గిల్ దుర్ఘటనను స్పష్టంగా ప్రస్తావించిన నవాజ్ షరీఫ్ అప్పటి ప్రభుత్వం లాహోర్ డిక్లరేషన్‌ను ఉల్లంఘించిందని అంగీకరించారు. ఇది పాకిస్థాన్ చేసిన పెద్ద తప్పు. మే 28, 1998న పాకిస్థాన్ ఐదు అణు పరీక్షలు నిర్వహించింది. నవాజ్ షరీఫ్ , అటల్ బిహారీ వాజ్‌పేయి 21 ఫిబ్రవరి 1999న లాహోర్ ఒప్పందంపై సంతకం చేశారు. భారత్- పాకిస్తాన్ మధ్య ఈ ఒప్పందం రెండు దేశాల మధ్య శాంతి స్థిరత్వాన్ని  పెంపొందించేలా ఒప్పందాలు చేసుకున్నారు.

1999 లాహోర్ ఒప్పందంలోని ప్రధాన అంశాలు
భారత్-పాకిస్థాన్ శాంతి, సుస్థిరతపై దృష్టి సారించాలి. జమ్మూ కాశ్మీర్‌తో సహా అన్ని సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలి. ఒకరి అంతర్గత వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూదు. అణ్వాయుధాలను అనధికారికంగా ఉపయోగించే పరిస్థితులను నివారించాలి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తొలగించేందుకు ఈ ఒప్పందం ముఖ్యమైన దౌత్య చొరవ.