Pushpa 2: The Rule: పుష్ప-2 నుంచి వచ్చిన కొత్త పాటలో ఈ మిస్టేక్స్ ను గమనించారా?

Pushpa 2: The Rule: ఒకరకంగా చెప్పాలి అంటే ఇది మంచి స్ట్రాటజీ అనే చెప్పాలి. ఇప్పటికే పుష్ప-2 నుంచి పుష్ప పుష్ప అంటూ వచ్చిన పాట సినిమాకు కావాల్సిన హైప్ ను తెచ్చింది. ఇందులో గ్లాస్ స్టెప్, ఫోన్ స్టెప్, స్లిప్పర్ స్టెప్ అంటూ మూడు రకాల స్టెప్స్ వైరల్ అయ్యాయి.

Written By: NARESH, Updated On : May 31, 2024 10:48 am

Pushpa 2

Follow us on

Pushpa 2: The Rule: అల్లు అరవింద్ కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన బన్నీ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. పుష్ప సినిమాతో తన రేంజ్ ను పెంచుకొని  దేశ నలుమూలలా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పుష్ప 2ను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఆల్మోస్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న పుష్ప-2.. ప్రమోషన్స్ వరకు వెళ్లింది. సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ చేస్తున్నారు.

ఒకరకంగా చెప్పాలి అంటే ఇది మంచి స్ట్రాటజీ అనే చెప్పాలి. ఇప్పటికే పుష్ప-2 నుంచి పుష్ప పుష్ప అంటూ వచ్చిన పాట సినిమాకు కావాల్సిన హైప్ ను తెచ్చింది. ఇందులో గ్లాస్ స్టెప్, ఫోన్ స్టెప్, స్లిప్పర్ స్టెప్ అంటూ మూడు రకాల స్టెప్స్ వైరల్ అయ్యాయి. ఇప్పుడు అవే ట్రెండింగ్ లో ఉన్నాయి అని తెలిసిందే. ఈ స్టెప్స్ మీద రీల్స్ చేసి అందరూ సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతున్నారు. ఇదే సినిమా నుంచి మరో సాంగ్ కూడా వచ్చేసింది.

ఈ పాటకి కపుల్ సాంగ్ అంటూ నామకరణం చేశారు. పాట వీడియో కూడా చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. అంటే, పాట రిహార్సల్ వీడియోని విడుదల చేశారన్నమాట. అందులోనే పాట లిరిక్స్ యాడ్ చేసి నెటిజన్లతో పంచుకున్నారు. ఈ పాటని అన్ని భాషల్లో కూడా శ్రేయ ఘోషల్ పాడితే.. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు.ఇక ఈ లిరికల్ వీడియోలో ఆయన కూడా మెరిసారు. లోకేషన్,సెట్టింగ్స్ చూస్తే మాత్రం ఈ పాట జాతరలో వచ్చే పాట అని అర్థం అవుతోంది. కొరియోగ్రఫీ  కూడా చాలా కొత్తగా ఆకట్టుకునేలా ఉంది.

అంతా బాగున్నా ఈ పాటలో ఒక మిస్టేక్ చేశారట మేకర్స్. ఈ పాటలో హీరో చైర్ లో రష్మిక మందన్న కూర్చొంటే.. హీరోయిన్ చైర్ లో అల్లు అర్జున్ కూర్చున్నారు. అంతా బాగానే ప్లాన్ చేసిన చైర్ ల విషయంలో లాజిక్ ఎలా మిస్ అయ్యారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కావాలనే చేశారా? జస్ట్ క్యాజ్ వల్ గా జరిగిపోయిందా అంటూ ప్రశ్నిస్తున్నారు. కానీ డైరెక్టర్ సుకుమార్ మాత్రం డైరెక్టర్ అని రాసి ఉన్న కుర్చీలోనే కూర్చున్నారు. మరి దీని మీద ఎవరు స్పందిస్తారో చూడాలి.