Kavitha: కవిత కోసం ఎమ్మెల్సీ పదవి సిద్ధమేనా?

Kavitha: కేసీఆర్ కుటుంబంలో కూడా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కొడుకు, అల్లుడు మంత్రి పదవుల్లో ఉండగా కూతురు కోసం కూడా కేసీఆర్ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొద్ది కాలంగా తండ్రి, కూతురు మధ్య మాటలు లేవని తెలుస్తోంది. కవిత రాష్ర్ట రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తుండగా కేసీఆర్ మాత్రం కూతురును రాజ్యసభకు పంపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ ను శాసనమండలికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కవిత మాత్రం రాష్ర్ట రాజకీయాల్లోనే […]

Written By: Srinivas, Updated On : November 23, 2021 5:41 pm
Follow us on

Kavitha: కేసీఆర్ కుటుంబంలో కూడా రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే కొడుకు, అల్లుడు మంత్రి పదవుల్లో ఉండగా కూతురు కోసం కూడా కేసీఆర్ ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కొద్ది కాలంగా తండ్రి, కూతురు మధ్య మాటలు లేవని తెలుస్తోంది. కవిత రాష్ర్ట రాజకీయాల్లోనే ఉండాలని భావిస్తుండగా కేసీఆర్ మాత్రం కూతురును రాజ్యసభకు పంపాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్ ను శాసనమండలికి పంపినట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కవిత మాత్రం రాష్ర్ట రాజకీయాల్లోనే ఉండాలని చూస్తున్నట్లు సమాచారం.

దీని కోసమే కొద్ది రోజులుగా వీరి మధ్య సఖ్యత లేదని తెలుస్తోంది. అందుకే గతంలో నిర్వహింిన టీఆర్ఎస్ ప్లీనరీకి కూడా కవిత గైర్హాజరైన విషయం తెలిసిందే. పార్టీ వ్యవహారాల్లో కూడా పాల్గొనడం లేదు. దీంతో నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీగా గెలిపించినా ఆమె తృప్తి చెందలేదని తెలుస్తోంది. ఆమెకు మంత్రి పదవిపై మక్కువ ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

కవిత వ్యవహారంలో కేసీఆర్ ఎన్ని దారులు చూపించినా ఆమె ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ కూతురు కోసం ఎమ్మెల్సీ పదవి చూపించినా ఆమె మాత్రం నిట్టూరుస్తున్నట్లు తెలిసింది. దీని కోసమే ఇద్దరి మధ్య విభేదాలు పొడచూపేందుకు అవకాశాలు కల్పిస్తున్నాయి. కూతురును రాజ్యసభకు పంపేందుకు సిద్ధపడినా ఆమె వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.

Also Read: 3 Capitals: జీతాలకే డబ్బుల్లేని జగన్ కు మూడు రాజధానులా?

టీఆర్ఎస్ లో కుటుంబ రాజకీయాలు పలు మలుపులు తిరుగుతున్నాయి. కేటీఆర్, కవిత ల మధ్య పొసగడం లేదని తెలుస్తోంది. పార్టీలో ఇప్పటికే కుటుంబ పాలన అని విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్ కు ఇప్పుడు కవిత పెద్ద తలనొప్పిగా మారే సూచనలు కనిపిస్తున్నాయని సమాచారం. దీంతో రాబోయే ఎన్నికల్లో పార్టీ మనుగడపై ఇది ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. ఇప్పటికైనా కేసీఆర్ స్పందించి కుటుంబ పాలన మచ్చ పోగొట్టుకునేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Also Read: AP Assembly: జగన్ పీచేముడ్.. బలమొచ్చింది.. ‘‘మండలి రద్దు’’ రద్దైంది!

Tags