KTR Karnataka Congress: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి తారకరామారావు బీజేపీని ఎదుర్కొనే క్రమంలో బెంగుళూరును కూడా టార్గెట్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అక్కడి కాంగ్రెస్ నేతలతో టచ్ లో ఉంటూ వారిని సంసిద్ధులను చేస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం కావడంతో అక్కడి కాంగ్రెస్ నేతల్లో జోష్ నింపేందుకు సిద్ధమవుతున్నారు. ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటాలని చూస్తుంటే కేటీఆర్ మాత్రం పక్క రాష్ట్రాలను లక్ష్యంగా చేసుకుని వాటిని రాబోయే ఎన్నికల్లో బీజేపీ పాలన నుంచి విముక్తం చేసే పనిలో పడినట్లు సమాచారం.
2023లో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్లాలని సూచిస్తూ కాంగ్రెస్ చీఫ్ శివకుమార్ కు హితబోధ చేశారు. భవిష్యత్ లో మీకు ఏ అవసరం ఉన్నా తాము చేస్తామని సూచించారు. దీనిపై కేటీఆర్ చేసిన ట్వీట్ పై కాంగ్రెస్ నేతలు స్పందించారు. హైదరాబాద్, బెంగుళూరు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండి తీరాలని చెప్పడం గమనార్హం. ఐటీ, బీటీ పై ఫోకస్ పెట్టి రెండు నగరాలను అభివృద్ధి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు.
కర్ణాటకలో బీజేపీ హలాల్, హిజాబ్ వ్యవహారాలను రాజకీయం చేస్తూ ప్రయోజనం పొందుతోందని కేటీఆర్ దుయ్యబట్టారు. బీజేపీని అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ కు సహకరిస్తామని చెబుతున్నారు. దీంతో బెంగుళూరు హైదరాబాద్ మధ్య సంబంధాల విషయంలో కేటీఆర్ చూపిస్తున్న చొరవ చూస్తుంటే బీజేపీని టార్గెట్ చేసుకుందని తెలుస్తోంది.
కర్ణాటకలో బీజేపీ ఇమేజ్ ను దెబ్బతీయాలని చూస్తోందని కేటీఆర్ అక్కడి కాంగ్రెస్ నేతలతో చెబుతున్నారు. రాజకీయ ఆటలో కేటీఆర్ చూపిస్తున్న చొరవ అక్కడి నేతల్లో ఉత్తేజం నింపుతోందని భావిస్తున్నారు. మొత్తానికి బీజేపీని ఎదుర్కొనే క్రమంలో కేటీఆర్ వారికి వత్తాసు పలకడంతో ఏ రకమైన వ్యూహాలు అవలంభిస్తారో తెలియడం లేదు.
మొత్తానికి కేసీఆర్ జాతీయ స్థాయిలో బీజేపీని అడ్డుకోవాలని చూస్తుంటే కొడుకు మాత్రం ప్రాంతీయంగా బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా బీజేపీని లక్ష్యంగా చేసుకుని టీఆర్ఎస్ తన ప్రయత్నాలు ముమ్మరం చేసిందని చెబుతున్నారు. అయితే విజయం సాధిస్తుందా లేక సాగిల పడుతుందా అనేదే తేలాల్సి ఉంది.
Also Read: ఢిల్లీలో కేసీఆర్.. మోడీ అపాయింట్ మెంట్ ఇస్తారా.. అసలు ప్లాన్ అదే