Trisha: హీరోయిన్ త్రిష మళ్ళీ తెలుగులో బిజీ అవ్వబోతుంది. త్రిష చేతిలో ఇప్పుడు మూడు పెద్ద చిత్రాలు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో రెండు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయట. ఆమెకి ఉన్నట్టుండి క్రేజ్ పెరగడానికి కారణమేంటో తెలియదు గానీ.. మొత్తానికి త్రిష అయితే, మళ్లీ టాలీవుడ్ లో తన గ్లామర్ రుచిని మళ్లీ చూపించబోతోంది.

ప్రస్తుతం తాను చేస్తున్న సినిమాల్లో ఏ సినిమా విజయం సాదించినా.. స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఛాన్స్ లు కొట్టేయొచ్చు అని త్రిష ఆశ పడుతుంది. ఎలాగూ, చిరంజీవి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా మెగాస్టార్ ఒక సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాలోనే త్రిష హీరోయిన్ గా నటిస్తోందని టాక్. అలాగే.. విక్టరీ వెంకటేష్ – తరుణ్ భాస్కర్ కలయికలో రాబోతున్న సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. అన్నట్టు బాలకృష్ణ కొత్త సినిమాకి కూడా త్రిష సైన్ చేసిందట. ఈ మూడు సినిమాలు రానున్న మూడు నెలల్లో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటాయి.
Also Read: తండ్రిగా భావిస్తే అలా చేశాడు.. అందుకే నటరాజ్‌ను లేపేస్తాను – తేజస్వి మదివాడ
అయితే, మరోపక్క త్రిషకి తమిళంలో మాత్రం క్రేజ్ తగ్గిపోయింది. అక్కడ వెబ్ సిరీస్ ల్లో అలాగే చిన్న చిత్రాల్లో మాత్రమే ఆమెకు అవకాశాలు దక్కుతున్నాయి. తమిళ నిర్మాతలు పూర్తిగా త్రిషని మర్చిపోయారు. దాంతో, ఆమె తెలుగులో వచ్చిన ఏ అవకాశాన్నీ వదులుకోడానికి అస్సలు ఇష్టపడడం లేదు.
మరోవైపు, త్రిష మాత్రం తన సినిమాల కథలు తనకు బాగా నచ్చాలి అంటూ సెల్ఫ్ డబ్బా బాగానే కొడుతోంది. కానీ, ప్రస్తుతం ఆమె ఉన్న పరిస్థితుల్లో ఆమెకు అవకాశాలు ఇవ్వడమే ఎక్కువ.. అలాంటిది.. ఇలా ఇష్టం వచ్చినట్టు పిచ్చి కామెంట్లు చేస్తే ఎలా ? అయినా త్రిష ఎక్కడా తగ్గేదే లేదు అంటుంది. చూడాలి మరి.. త్రిష కొత్త ఇన్నింగ్స్ ఎంత దూరం వెళ్తుందో.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ చూడని ప్రేక్షకులకు శుభవార్త !