https://oktelugu.com/

కాంగ్రెస్ తో కటీఫ్ అంటున్న కోదండరాం?

తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కోదండరాం ఆ పార్టీతో కటీఫ్ కు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వైఖరి కారణంగానే కోదండరాం ఆపార్టీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల టీజేఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది. కోదండరాం కాంగ్రెస్ కు దూరమవుతున్నాడనే ప్రచారం జరుగుతుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. Also Read: బండిగారు… స్పీడ్ తగ్గించండి! 2018లో […]

Written By:
  • Neelambaram
  • , Updated On : August 25, 2020 / 02:41 PM IST
    Follow us on


    తొలి నుంచి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న కోదండరాం ఆ పార్టీతో కటీఫ్ కు సిద్ధమవుతున్నారనే ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ వైఖరి కారణంగానే కోదండరాం ఆపార్టీకి దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల టీజేఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇరుపార్టీల మధ్య బేదాభిప్రాయాలు వచ్చాయని తెలుస్తోంది. కోదండరాం కాంగ్రెస్ కు దూరమవుతున్నాడనే ప్రచారం జరుగుతుండటం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

    Also Read: బండిగారు… స్పీడ్ తగ్గించండి!

    2018లో కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన సమయంలో కోదండరాం కాంగ్రెస్ తో కలిసి నడిచారు. ఎన్నికల ఫలితాలతో నిమిత్తం లేకుండా నిన్నటి వరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ తో కలిసి ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు. ఈక్రమంలోనే టీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌కు అనుకూలంగానే టీజేఎస్ పుట్టిందని ఎన్ని విమర్శలు వచ్చినా కోదండరాం పట్టించుకోకుండా ఆ పార్టీతో స్నేహంగా ఉంటున్నారు.

    కాంగ్రెస్ కు మిత్రపక్షంగా కొనసాగుతున్న టీజేఎస్ నేతలను ఆ పార్టీలో చేర్చుకోవడంపై కోదండరాం మండిపడుతున్నారు. ఇటీవల టీజేఎస్ పార్టీకి చెందిన కీలక నేత భవానీని కాంగ్రెస్ నేతలు ఆపార్టీలో చేర్చుకోవడంతో కోదండరాం అలక మనస్థాపం చెందినట్లు తెలుస్తోంది. తమ పార్టీ తరుఫున బలమైన గొంతు విన్పిస్తున్న నేతలను కాంగ్రెస్ లోకి చేర్చుకొని ఆహ్వానించడంపై ఆయన మండిపడుతున్నారు. తమ పార్టీని బలహీనం చేస్తుండటంతో కాంగ్రెస్ కు దూరంగా ఉండాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

    Also Read: ఉలిక్కి పడిన నగరం.. జంట పేలుళ్లకు నేటికి 13ఏళ్లు

    ఇదిలా ఉంటే కాంగ్రెస్ మాత్రం రానున్న దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ, వరంగల్, ఖమ్మం మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఇతర పార్టీల నేతలను చేర్చుకోవడంపై దృష్టిసారించింది. దీనిలో భాగంగానే అధికార పార్టీ నేతలతోపాటు టీజేఎస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. దీనిపై కోదండరాం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

    టీజేఎస్ నేతలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంతో ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని కోదండరాం అంటున్నారు. ఇంతమాత్రానికి తాము మిత్రపక్షంగా ఎందుకు ఉండాలని కాంగ్రెస్ నేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో కాంగ్రెస్, టీజేఎస్ మధ్య దూరం పెరిగిందనే టాక్ విన్పిస్తోంది. దీంతో కోదండరాం కాంగ్రెస్ తో కొనసాగుతారా? లేక ఒంటరిగా వెళుతారనేది ఆసక్తికరంగా మారింది.