https://oktelugu.com/

నిర్మాణంలో చరణ్ కి కొత్త భాగస్వామ్యం !

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుండటంతో రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా నిర్మాణ భాగ‌స్వామ్యం నుంచి త‌ప్పుకుంటున్నార‌ని.. ఇప్పటికే మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఆచార్య నిర్మాణ భాగస్వామ్యాన్ని తీసుకుందని సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూట్ తో బిజీగా ఉండాల్సి రావడం, అలాగే సైరా న‌ష్టం కూడా చరణ్ కి కాస్త నిర్మాణ రంగం పై […]

Written By:
  • admin
  • , Updated On : August 25, 2020 / 02:21 PM IST
    Follow us on


    సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమా షూటింగ్ అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతుండటంతో రామ్ చ‌ర‌ణ్ ఈ సినిమా నిర్మాణ భాగ‌స్వామ్యం నుంచి త‌ప్పుకుంటున్నార‌ని.. ఇప్పటికే మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఆచార్య నిర్మాణ భాగస్వామ్యాన్ని తీసుకుందని సోషల్ మీడియాలో రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే చరణ్ ఆర్.ఆర్.ఆర్ షూట్ తో బిజీగా ఉండాల్సి రావడం, అలాగే సైరా న‌ష్టం కూడా చరణ్ కి కాస్త నిర్మాణ రంగం పై ఆసక్తి తగ్గడానికి కారణం అయిందని తెలుస్తోంది. దాంతోనే చరణ్ ఆచార్య సినిమా నిర్మాణం నుండి తప్పుకునే ఆలోచన చేస్తారని వార్తలు వచ్చాయి.

    Also Read: రానా ‘హిరణ్య కశ్యప’లో అల్లు అర్జున్‌?

    అయితే ఇలాంటి ప్ర‌చారాలతో ఆచార్య‌పై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ పెరుగుతుందని భావించిన చరణ్ టీమ్ తో పాటు స‌ద‌రు సంస్థ వెంట‌నే అధికారికంగా దీని పై వివ‌ర‌ణ ఇస్తూ.. ఆచార్య సినిమాని కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి మ్యాట్నీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోందని స్పష్టం చేసింది. భారీ సినిమాకి నిర్మాణ భాగ‌స్వామ్యం త‌ప్ప‌నిస‌రి అనేది మేకర్స్ చెబుతున్న మాట. సినిమా బ‌డ్జెట్ ని 50-50 బేసిస్ లో షేర్ చేసుకుంటున్నార‌ని…అయితే లాభాలను మాత్రం మెగాస్టార్ తో పాటు నిర్మాణ సంస్థలు కూడా సమానంగా పంచుకుంటారని తెలుస్తోంది. ఇక మొన్న రిలీజైన ఆచార్య మోష‌న్ పోస్ట‌ర్ బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.

    Also Read: సుశాంత్ ను చంపి ఉరితీశారా? సీబీఐ విచారణలో కొత్త కోణం?

    మోషన్ పోస్టర్ కు అభిమానుల్లో మంచి స్పందన వచ్చింది. దేవాదాయ‌ భూముల స్కామ్ నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే విధంగా ఈ సినిమా ఉంటుందట. ఇక ఇప్పటికే కేంద్రం షూటింగుల‌కు అన్ లాక్ 4.0 ప్ర‌కారం నియ‌మ‌నిబంధ‌న‌ల్ని పొందుప‌రిచిన కోవిడ్ రూల్స్ ను పాటిస్తూ షూటింగ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో చ‌ర‌ణ్ ఓ కీల‌క పాత్ర‌ను పోషించ‌నున్నారు. కానీ ఆర్.ఆర్.ఆర్ చిత్రీక‌ర‌ణ ముగిస్తే గాని ఆ విష‌యం మీద కూడా ఇంకా క్లారిటీ రాదు.