కరోనా లక్షణాల్లో నిరంతర మార్పులు.. వ్యాక్సిన్ పనిచేసినా?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుకుంటోంది. శాస్త్రవేత్తలు ఈ వైరస్ లో ఏకంగా 3,427 ఉత్పరివర్తనాలను గుర్తించారని సమాచారం. వైరస్ జన్యు క్రమాన్ని నిర్వీర్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దేశంలోని 20 రాష్ట్రాల్లోని 35 ల్యాబ్ లలో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. Also Read : కరోనా మృతదేహాల్లో ఈ కొత్త లక్షణాలు! వైరస్ నిర్మాణంలో మార్పులు జరగడం వల్లే […]

Written By: Navya, Updated On : August 25, 2020 3:56 pm
Follow us on

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా మహమ్మారి ఎప్పటికప్పుడు రూపాన్ని మార్చుకుంటోంది. శాస్త్రవేత్తలు ఈ వైరస్ లో ఏకంగా 3,427 ఉత్పరివర్తనాలను గుర్తించారని సమాచారం. వైరస్ జన్యు క్రమాన్ని నిర్వీర్యం చేయడం లక్ష్యంగా పెట్టుకుని శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. దేశంలోని 20 రాష్ట్రాల్లోని 35 ల్యాబ్ లలో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.

Also Read : కరోనా మృతదేహాల్లో ఈ కొత్త లక్షణాలు!

వైరస్ నిర్మాణంలో మార్పులు జరగడం వల్లే వ్యాధి లక్షణాల్లో మార్పులు జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొదట్లో శాస్త్రవేత్తలు జలుబు, జ్వరం, తలనొప్పి, శ్వాస సంబంధిత సమస్యలను కరోనా లక్షణాలుగా గుర్తించారు. ప్రస్తుతం 80 శాతం మందికి కరోనా లక్షణాలు కనిపించడం లేదు. నిపుణులు వైరస్ నిర్మాణంలో మార్పులు జరిగితే కరోనా కొత్త లక్షణాలు కనిపిస్తాయని చెబుతున్నారు.

అయితే వైరస్ లో మార్పులు చోటు చేసుకుంటుండటంతో వ్యాక్సిన్ వైరస్ ను అడ్డుకోగలదా…? అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ఒక రకం వైరస్‌ను ఎంచుకొని తయారు సంస్థలు వ్యాక్సిన్ ను రూపొందిస్తుండగా ఉత్పరివర్తనాలు పొంది కొత్త రూపంలోకి మారిన వైరస్‌ ను వ్యాక్సిన్ ను అడ్డుకుంటుందా….? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ పరిశోధనలు చేస్తున్న కొద్దీ వైరస్ లో ఉత్పరివర్తనాలు కనిపిస్తున్నాయని… గతంలో వచ్చిన వ్యాక్సిన్లు ఉత్పరివర్తనాలపై కూడా ప్రభావవంతంగా పనిచేశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Also Read : ఏపీలో లక్షణాలు లేకపోయినా 90 శాతం మందికి కరోనా…?