తమిళనాడులో మూడేళ్ల క్రితం కమల్ హాసన్ మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించారు. డీఎంకే, ఏఐడీఎంకే లకు ప్రత్యామ్నాయం కావాలని కలలు కన్నారు. కానీ విజయం అందుకోలేక చతికిలపడిపోయారు. కనీసం ఒక్క స్థానం కూడా గెలవలేకపోయారు. దీంతో డోలాయమానంలో పడ్డారు. అధికారమనేది మామూలుగా రాదు. దానికి అకుంఠిత శ్రమ, పట్టుదల, దీక్ష కావాలి. మగల పుబలో అధికారం రావాలంటే కుదరదు. ఓట్లు వేసే జనం నమ్మరు.
కింగ్ మేకర్ కావాలని..
తమిళనాడులో కింగ్ మేకర్ కావాలని కమల్ హాసన్ భావించారు. కానీ కనీసం కింగ్ కూడా కాలేకపోయారు. ఎవరితోనూ కలవకుండా బీజేపీని పక్కన పెట్టారు. డీఎంకే, ఏఐడీఎంకే లకు ప్రత్యామ్నాయం కావాలని చూశారు. ఇందుకోసం తృతీయ కూటమి ఏర్పాటు చేశారు. ఊహించని దెబ్బ తిన్నారు. కనీసం ఆయన కూడా విజయం సాధించలేక నైరాశ్యంలో పడిపోయారు.
విలువలతో..
నైతిక విలువలతో పార్టీన నడపాలని భావించారు కమల్. కానీ కుదరలేదు. ఈ రోజుల్లో నైతికతకు ఎక్కడ ప్రాధాన్యం ఉంది. అంత ప్రామాణికత కనిపించదు. మక్కల్ నీది మయ్యమ్ పార్టీ కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి. దీంతో కమల్ తీవ్ర మనోవేదనకు గురయ్యారు. దక్షిణ నియోజకవర్గం నుంచి కూడ కమల్ అపజయం పాలయ్యారు.
పార్టీని నడపడం సాధ్యం కాదు
ప్రజలు కమల్ హాసన్ కు షాకివ్వడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఓటమి చెందడంతో పార్టీని నడపడం సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు. ప్రజలు ఆదరించకపోవడంతోనే పార్టీని మూసివేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎన్నికల అనంతరం పార్టీ నేతలు వరుసగా రాజీనామాలు చేయడంతో మనస్థాపానికి గురయ్యారు. వచ్చే ఎన్నికల వరకు నిరీక్షించడం వీలు కాదని పార్టీని మూసి వేయాలని నిశ్చయించుకున్నారు.