https://oktelugu.com/

వలసలతోనే బెంగాల్ లో విజయం దూరమైందా?

పశ్చిమ బెంగాల్ లో ఓటమిపై బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయం తమదేనన్న ధీమాతో పదేళ్లు కష్టపడినా అధికారం అందకుండా పోవడంతో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. చేసిన తప్పులు మళ్లీ చేయొద్దని నిర్ణయిస్తున్నారు. అధికారమనే ఆటలో గెలుపోటములు తప్పవని చెబుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. దీని కోసం ఇప్పటి నుంచే పలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఓటమిని ప్రభావితం చేసిన అంశాలపై దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రభావం లేకపోవడంతో.. […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 21, 2021 9:26 am
    Follow us on

    BJP

    పశ్చిమ బెంగాల్ లో ఓటమిపై బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. విజయం తమదేనన్న ధీమాతో పదేళ్లు కష్టపడినా అధికారం అందకుండా పోవడంతో పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఓటమికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. చేసిన తప్పులు మళ్లీ చేయొద్దని నిర్ణయిస్తున్నారు. అధికారమనే ఆటలో గెలుపోటములు తప్పవని చెబుతున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సత్తా చాటాలని మార్గదర్శకాలను రూపొందిస్తున్నారు. దీని కోసం ఇప్పటి నుంచే పలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఓటమిని ప్రభావితం చేసిన అంశాలపై దృష్టి సారిస్తున్నారు.

    కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రభావం లేకపోవడంతో..
    పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల ప్రభావం లేకపోవడంతో ఇక అధికారం తమదేనని బీజేపీ భావించింది. ఇందులో భాగంగానే అధికారం చేజిక్కించుకోవాలనే ఆశతో పావులు కదిపింది. కానీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు అధికారం కోల్పోయింది. దీదీపై మోదీ ప్రభావం చూపలేకపోయారనే విషయం తేటతెల్లమైంది. నేతలంతా బెంగాల్ చుట్టు తిరిగినా అధికారం అందుకోలేకపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో నైనా పరువు నిలబెట్టుకోవాలని పావులు కదుపుతున్నారు.

    ఎక్కువ మందిని చేర్చుకున్నందుకు..
    టీఎంసీ నుంచి వచ్చిన వారందరినీ చేర్చుకోవడం వల్ల బీజేపీ నాయకులు సహకరించలేదు. ఫలితంగా ఎన్నికల్లో పరాభవం చెందారు. సొంత పార్టీలో పనిచేసినా తగిన గుర్తింపు లేదని భావించిన వారు ప్రచారానికి దూరమయ్యారు. ఈ నేపథ్యంలో సరైన నాయకులు లేక విజయతీరాలు చేరుకోలేకపోయారు.

    ఎన్నికల అనంతరం దాడుల్లో..
    పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల అనంతరం జరిగిన హింసాకాండలో బీజేపీ నాయకులు 11 మంది చనిపోయారు. వారి కుటుంబాలను బీజేపీ అధ్యక్షుడు నడ్డా పరామర్శించారు. అయితే బెంగాల్ లో ఓడినా ఓటింగ్ శాతం, సీట్ల సంఖ్య పెంచుకున్నామని బీజేపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో నైనా సత్తా చాటి దీదీని దెబ్బతీయాలని భావిస్తున్నట్లు సమాచారం.