Stolen votes: పౌరులకు రాజ్యాంగం కల్పించిన అత్యంత శక్తివంతమైన ఆయుధం ఓటు హక్కు. దీనిని సరైన పద్ధతిలో వినియోగించుకుంటే శ్రీరామరక్షలా ప్రజలను కాపాడుతుంది. అలా కాకుండా ఓటును నోటు కోసమే.. మందుకోసమే.. ఇతర ప్రలోభాలకు లోబడి ఉపయోగించుకుంటే అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రతీ ఎన్నికలో ఇలాంటి ఘటనలు మన కళ్లే ముందు కన్పిస్తూనే ఉంటాయి.
ఎన్నికల్లో మనం ఓటు వేయడానికి వెళ్లినప్పుడు మనకంటే ముందు ఎవరో ఒకరు దొంగ ఓటు వేసిన ఘటనలు కన్పిస్తూ ఉంటాయి. ఒకసారి మన ఓటు ఇతరులు వేసి వెళితే ఇక మనం చేసేదీ ఏముండదు. ఎన్నికల అధికారులకు చెప్పినా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇలాంటి ఘటనలతో చాలా మంది ఓటర్లు ఓటు వేయకుండానే నిరాశతో వెనుదిరుగుతూ ఉంటాయి. అయితే వీటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం ఎన్నికల ప్రయత్నాలు చేసినా సాధ్యం కావడం లేదు.
దొంగ ఓట్లు వేసే వారంతా కొత్త మార్గాలను అన్వేషిస్తుండటంతో వీటిని అరికట్టడం ఎన్నికల సంఘానికి తలకు మించిన భారంగా మారుతోంది. దీంతో ప్రతీ ఎన్నికల్లోనూ దొంగ ఓట్లు వేయడం కామన్ అయిపోయింది. ఈక్రమంలోనే దొంగ ఓట్లకు అరికట్టాలనే డిమాండ్ గత కొన్నేళ్లుగా ఓటర్ల నుంచి డిమాండ్ విన్పిస్తోంది.
దేశంలోని అన్ని కార్యకలాపాలకు ఆధార్ ను అనుసంధానిస్తున్నప్పుడు ఓటరు కార్డుకు ఎందుకు వర్తింపజేయడం లేదని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై అధికారంలో ఉన్న పార్టీ పెద్దగా ఫోకస్ పెట్టడం లేదు.ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నట్లుండి కేంద్ర మంత్రివర్గం ఆధార్ తో ఓటుకార్డును అనుసంధించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చింది.
Also Read: పరిశోధనాత్మక పాత్రికేయం అంతరించలేదు.. యాజమాన్యాలే చంపేశాయ్ సార్?
దీని వల్ల దొంగ ఓట్లకు చెక్ పెడుతుందని కేంద్రం చెబుతోంది. ఆధార్ కార్డు అనేది ఒక వ్యక్తికి ఒకటే ఉంటుంది. దీనిని ఓటరు కార్డు అనుసంధానించడం వల్ల రెండుమూడు చోట్ల ఓటువేసే వాళ్లకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది.నిజమైన ఓటరు మాత్రమే ఓటు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. దొంగ ఓట్లను అరికట్టడం వల్ల ప్రజలకు నిజంగా సేవ చేసే నాయకులే ఎన్నుకోబడే ఛాన్స్ దక్కనుంది.
ఇక ఎన్నికల సంఘం ఇప్పటిదాకా జనవరి 1వ తేదిన ప్రామాణికంగా తీసుకొని కొత్తగా ఓటు హక్కు అవకాశాలు కల్పిస్తోంది. అయితే ఇక నుంచి ఏడాదిలో నాలుగు తేదిలను తీసుకోవాలని మంత్రివర్గం ఎన్నికల సంఘానికి సూచించినట్లు తెలుస్తోంది.
మొత్తానికి ఎన్నికల సంఘం సంస్కరణలు చేసేందుకు సిద్ధమవుతుండటంతో దొంగ ఓట్లకు చెక్ పడే అవకాశం ఎక్కువగా కన్పిస్తోంది. ఇది కనుక జరిగితే దొంగ నాయకులకు కూడా కాలం చెల్లినట్లేననే కామెంట్స్ విన్పిస్తున్నాయి. దీంతో వీలైనంత తొందరగా ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఓటర్లు కోరుతున్నారు.
Also Read: అమ్మాయిల కనీస వివాహ వయసు 18 కాదు 21.. కేంద్రం నిర్ణయంతో అందరిలో హర్షం