https://oktelugu.com/

RK Roja: రోజాకు చెక్ పెట్టేందుకు అసమ్మతి వర్గం రెడీ?

RK Roja: కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ అంటే రేణుకా చౌదరి అని తెలుసు. వైసీపీలో కూడా ఓ ఫైర్ బ్రాండ్ ఉంది ఆమే రోజా. ఆమె మాట తీరు కూడా అలాగే ఉంటుంది. కానీ ఆమెకు మంత్రి పదవి మాత్రం ఇప్పటి వరకు రాకుండా చేస్తున్నారు. ఆది నుంచి వైసీపీ ఎదుగుదలకు ప్రధాన కారణంగా వస్తున్న ఆమెకు ఇంత కాలమైనా మంత్రి పదవి రాకుండా చేయడంలో సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 16, 2021 / 03:16 PM IST
    Follow us on

    RK Roja: కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ అంటే రేణుకా చౌదరి అని తెలుసు. వైసీపీలో కూడా ఓ ఫైర్ బ్రాండ్ ఉంది ఆమే రోజా. ఆమె మాట తీరు కూడా అలాగే ఉంటుంది. కానీ ఆమెకు మంత్రి పదవి మాత్రం ఇప్పటి వరకు రాకుండా చేస్తున్నారు. ఆది నుంచి వైసీపీ ఎదుగుదలకు ప్రధాన కారణంగా వస్తున్న ఆమెకు ఇంత కాలమైనా మంత్రి పదవి రాకుండా చేయడంలో సొంత పార్టీలోనే అసమ్మతి వర్గం పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే గతంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పని చేసినా వారి విజయాన్ని మాత్రం ఆపలేకుండా పోయారు.

    MLA Roja

    రాబోయే ఎన్నికల్లో రోజాకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అసమ్మతి నేతలంతా సమావేశమయ్యారు. రోజాకు వ్యతిరేకంగా ఎలాంటి వ్యూహాలు రచించాలనే దానిపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో నగరిలో రోజాకు ప్రాతినిధ్యం లేకుండా చేయాలని చూస్తున్నట్లు చెబుతున్నారు.

    రోజా కాకుండా ఎవరైనా ఎమ్మెల్యే అయినా ఫర్వాలేదు కానీ ఆమెను మాత్రం రానీయకుండా చేసేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. నగరిలో ఆమెకు ఆశలు లేకుండా చేయాలనేదే వారి పన్నాగంలా కనిపిస్తోంది. ఇదే విషయమై ఆమె దగ్గర ప్రస్తావిస్తే అలాంటిదేమీ లేదని కొట్టి పారేస్తున్నారు. కానీ వారంతా జగన్ దగ్గరికి వెళ్లి తమ ఆగ్రహం వెళ్లగక్కాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో రాబోయే ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వొద్దనే రాగం అందుకోనున్నట్లు చెబుతున్నారు.

    Also Read: PRC: తెగని పీఆర్సీ పంచాయితీ.. పట్టువీడని ఉద్యోగ సంఘాలు

    దీనికి కారణం కూడా చెబుతున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తూ ఇన్నాళ్లు పార్టీని పట్టుకున్న వారిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో రోజా ఏ మేరకు వారి కుట్రలను అడ్డుకుంటారో తెలియడం లేదు. కానీ రాబోయే ఎన్నికల నాటికి రోజా అసమ్మతి వర్గాన్ని ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాల్సిందే.

    Also Read: Perni Nani: పేర్ని నాని ఇన్నాళ్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కాదట?

    Tags