https://oktelugu.com/

Chiranjeevi: చిరుకి ఏమైంది ? వారికెలా ఛాన్స్ ఇస్తున్నాడు ?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాం అంటుంటారు ఇప్పటి దర్శకులు. అందుకే జీవితంలో ఎప్పటికైనా చిరుతో ఒక సినిమా అయినా చేయాలని ఇప్పటి దర్శకులందరికీ ఒక బలమైన కోరిక ఉంది. అయితే, అది మెగా డ్రీమ్.. కాబట్టి కోరిక తీరడం కష్టం అనుకునేవాళ్లు ఇన్నాళ్లు. పైగా మీడియం రేంజ్ డైరెక్టర్లకు జీవితంలో ఆ కోరిక తీరదు అని ఇండస్ట్రీలో ఓ నమ్మకం. కానీ, కాలం మారుతుంది, చిరు కూడా మారుతున్నారు. అందుకే, నమ్మకాలను పక్కన పెట్టేస్తున్నాడు. […]

Written By:
  • Shiva
  • , Updated On : December 16, 2021 / 03:32 PM IST
    Follow us on

    Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చూస్తూ పెరిగాం అంటుంటారు ఇప్పటి దర్శకులు. అందుకే జీవితంలో ఎప్పటికైనా చిరుతో ఒక సినిమా అయినా చేయాలని ఇప్పటి దర్శకులందరికీ ఒక బలమైన కోరిక ఉంది. అయితే, అది మెగా డ్రీమ్.. కాబట్టి కోరిక తీరడం కష్టం అనుకునేవాళ్లు ఇన్నాళ్లు. పైగా మీడియం రేంజ్ డైరెక్టర్లకు జీవితంలో ఆ కోరిక తీరదు అని ఇండస్ట్రీలో ఓ నమ్మకం.

    Chiranjeevi

    కానీ, కాలం మారుతుంది, చిరు కూడా మారుతున్నారు. అందుకే, నమ్మకాలను పక్కన పెట్టేస్తున్నాడు. చిన్న పెద్ద అని చిరు చూడటం లేదు. మంచి కథతో వస్తే చాలు, అతనికి సినిమా ఇచ్చేస్తున్నాడు. దాంతో ఇప్పుడు దర్శకులందరికీ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక కలుగుతుంది. ఇప్పుడు సెట్స్ పై వున్న మెగాస్టార్ సినిమాలను, ఆ సినిమాల దర్శకులని చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది.

    కొరటాల శివను పక్కన పెడితే.. ప్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్, ఇక ఊరు పేరు తెలియని మోహన్ రాజా.. చిన్న డైరెక్టర్ అని పేరు తెచ్చుకున్న బాబీ, అసలు సినిమా చేయగలడా అని అనుమానం వచ్చేలా ఉండే వెంకీ కుడుముల.. వీళ్ళంతా ఇప్పుడు చిరంజీవితో సినిమా చేస్తున్నవాళ్లు. అసలు ఇలాంటి డైరెక్టర్లతో సినిమా చేయడానికి మీడియం రేంజ్ హీరోలు కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటారు.

    అలాంటిది, మెగాస్టార్ మాత్రం వాళ్లనే వెతికి మరీ, పిలిచి మరీ ఛాన్స్ లు ఇస్తున్నాడు. అసలు మెగాస్టార్ అంటేనే భారీ తనం. కానీ, చిరుతో సినిమాలు చేస్తోన్న పై దర్శకులెవరికీ అసలు మాస్ సినిమాలు చేసినా అనుభవమే లేదు. అలాంటిది, మాస్ అంశాలు పెట్టి.. ఊగిపోయే ఎలిమెంట్స్ వున్న సినిమాలు ‘పై దర్శకులు’ ఏమి తీస్తారు ?

    Also Read: Pushpa: పుష్ప లవ్ ట్రాక్ పై క్రేజీ అప్ డేట్.. ఇష్టం లేని పెళ్లి అట !

    తీసినా తీయకపోయినా వాళ్లకు మెగాస్టార్ చిరంజీవి కథ చెప్పగానే ఛాన్స్ ఇచ్చారు. మరి చిరు కెరీర్ ఈ దర్శకులతో ఇక ముగుస్తుందేమో. చిరు కూడా మరో మూడేళ్ళలో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పాలని నిర్ణయించుకున్నారట. అందుకే, స్పీడ్ గా సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలో తన దగ్గరకు ఎవరు మంచి కథతో వస్తే.. వారికీ అవకాశం ఇస్తున్నారు.

    Also Read: ఆ నీలి చిత్రాల మరకల్లో నష్టపోయింది ఆమె మాత్రమే !

    Tags