కేసీఆర్ పై కోదండరాం పైచేయి సాధిస్తారా?

టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంపై ప్రతీసారి సీఎం కేసీఆర్ దే పైచేయి అవుతూ వస్తోంది. అయితే ఈసారి కోదండరాం వంతు వచ్చిందనే టాక్ విన్పిస్తోంది. వార్డు మెంబర్ గా కూడా గెలువలేడని సీఎం కేసీఆర్ గతంలో కోదండరాంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్రదుమారం రేపాయి. దీంతో 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి తన సత్తా చూపించాలని కోదండరాం అనుకున్నారు. అయితే ప్రజాకూటమి రాజకీయ సమీకరణాల్లో భాగంగా నాడు కోదండరాం చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే […]

Written By: Neelambaram, Updated On : July 25, 2020 2:14 pm
Follow us on


టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాంపై ప్రతీసారి సీఎం కేసీఆర్ దే పైచేయి అవుతూ వస్తోంది. అయితే ఈసారి కోదండరాం వంతు వచ్చిందనే టాక్ విన్పిస్తోంది. వార్డు మెంబర్ గా కూడా గెలువలేడని సీఎం కేసీఆర్ గతంలో కోదండరాంను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్రదుమారం రేపాయి. దీంతో 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి తన సత్తా చూపించాలని కోదండరాం అనుకున్నారు. అయితే ప్రజాకూటమి రాజకీయ సమీకరణాల్లో భాగంగా నాడు కోదండరాం చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే ఇప్పుడు మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల్లో సత్తాచాటేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

Also Read: బాబుకు శ్రావణమాసం టెన్షన్..!

తెలంగాణ ఉద్యమంలో కోదండరాం కీలకంగా వ్యవహరించారు. కేసీఆర్-కోదండరాంలు ఇద్దరు కూడా ఉద్యమానికి రెండుకళ్లలా వ్యహరించారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ సీఎం అయ్యారు. కోదండరాం కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగా ఉండటంతో కేసీఆర్, కోదండరాంల మధ్య కొద్దిరోజులు మాటలయుద్ధం నడిచింది. ఒకరిపై ఒకరు తీవ్రపదజాలంతో దూషించుకునేంత వరకు వెళ్లింది. ఉద్యమ సమయంలో టీజేఎస్ అధ్యక్షుడిగా కొనసాగిన కోదండరాం కిందటి ఎన్నికల్లో టీజేఎస్ పార్టీని ప్రకటించి కేసీఆర్ కు వ్యతిరేకంగా పని చేశారు.

ఈ సమయంలోనే కోదండరాం కనీసం వార్డుమెంబర్ గా కూడా గెలవలేని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారాయి. దీంతో కోదండరాం గత ఎన్నికల్లో జనగామ నుంచి పోటీచేయాలని భావించారు. అయితే అది మాజీ మంత్రి, మాజీ పీసీసీ పొన్నాల లక్ష్మీనారాయణ నియోజకవర్గం కావడంతో రాజకీయ సమీకరణాల్లో భాగంగా ఆ సీటు చివరికీ పొన్నాలకే దక్కింది. దీంతో ఈ ఎన్నికల్లో కోదండరాం పోటీ చేయలేదు. దీంతో కేసీఆర్ వ్యాఖ్యలకు ప్రత్యక్షంగా కోదండరాం సమాధానం చెప్పలేకపోయారు. అయితే తాజాగా ఆయన ఎమ్మెల్సీ బరిలో నిలిచి కేసీఆర్ షాకిచ్చేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read: ఓట్లు లేవు.. పార్టీకి నేతల పోట్లు మాత్రం ఉన్నాయి

తెలంగాణలో వచ్చే ఫిబ్రవరి నాటికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిలో ఒకటి వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంకాగా మరొకటి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ స్థానం. ఇందులో వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానం నుంచి కోదండరాం బరిలో నిలువాలని భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ స్థానంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా మార్చినాటికి ఆయన పదవీకాలం ముగియనుంది.

ఈ ఎన్నికల్లో పట్టాభద్రులే ఓటుహక్కు వినియోగించుకోనుండటంతో ఇదే సరైన వేదికగా కోదండరాం భావిస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యావంతులు టీఆర్ఎస్ పాలనపై వ్యతిరేకంగా ఉండటం తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారట. వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతంలోని నేతలందరితో కోదండరాంకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈ స్థానంలో పోటీచేస్తే తన గెలుపు ఖాయమని కోదండరాం భావిస్తున్నారట. తాను ఎమ్మెల్సీగా గెలిచి సీఎం కేసీఆర్ కు షాక్ ఇవ్వాలని కోదండరాం భావిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

Tags