https://oktelugu.com/

ప్లాప్ డైరెక్టర్ మీద 500 కోట్లు పెట్టడమేమిటి ?

మెగాస్టార్ తో సైరా లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి తరువాత సినిమా ఫలానా హీరోతో ఫలానా నిర్మాతతో అని విస్తృతగా వార్తలు రావడం.. ఆ తరువాత సురేందర్ రెడ్డి – అక్కినేని అఖిల్ సినిమా దాదాపు ఫిక్స్ అయిందని.. దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారని బాగా వినిపించింది. అందరూ ఈ కాంబినేషన్ ఖాయం అనుకున్నారు. కానీ ఎట్టకేలకు సురేందర్ రెడ్డి ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ తోనే సినిమాని ఫిక్స్ చేసుకున్నాడు. యంగ్ […]

Written By:
  • admin
  • , Updated On : September 3, 2020 / 10:57 AM IST
    Follow us on


    మెగాస్టార్ తో సైరా లాంటి భారీ సినిమా చేసిన దర్శకుడు సురేందర్ రెడ్డి తరువాత సినిమా ఫలానా హీరోతో ఫలానా నిర్మాతతో అని విస్తృతగా వార్తలు రావడం.. ఆ తరువాత సురేందర్ రెడ్డి – అక్కినేని అఖిల్ సినిమా దాదాపు ఫిక్స్ అయిందని.. దానయ్య ఈ సినిమాని నిర్మిస్తున్నారని బాగా వినిపించింది. అందరూ ఈ కాంబినేషన్ ఖాయం అనుకున్నారు. కానీ ఎట్టకేలకు సురేందర్ రెడ్డి ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్ తోనే సినిమాని ఫిక్స్ చేసుకున్నాడు. యంగ్ నిర్మాత రామ్ తాళ్లూరి నిర్మాణంలో దాదాపు మూడు వందల కోట్లుతో ఈ సినిమా తెరకెక్కబోతునట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఉంటుందని… సురేందర్ రెడ్డి మాత్రం ఇప్పటికే ప్రభాస్ కోసం రైటర్ సాయి మాధవ్ బుర్రాతో కూర్చుని స్క్రిప్టును సిద్ధం చేస్తోన్నాడని.. నేషనల్ స్టార్ ప్రభాస్ ని హాలీవుడ్ సూపర్ స్టార్ రేంజ్ లో చాలా స్టైలిష్ గా చూపించాలనే కసితో సురేందర్ రెడ్డి స్క్రిప్టు మీద వర్క్ చేస్తున్నాడని తెలుస్తోంది.

    Also Read: బిగ్ బాస్ పై సునీత రియాక్షన్ !

    కాగా అవసరమైతే.. మరో బాలీవుడ్ నిర్మాతను కూడా కలుపుకుని సినిమా బడ్జెట్ ను 500 కోట్లుకు పెంచాలనే ఆలోచనలో కూడా రామ్ తాళ్లూరి ఉన్నారట. అయితే సురేందర్ రెడ్డిని నమ్ముకుని 500 కోట్లు పెట్టడం పెద్ద రిస్క్ అని ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ఇండియాలో అన్ని ఇండస్ట్రీలకు సంబంధించిన సూపర్ స్టార్స్ నటించినా… సైరాని ప్లాప్ నుండి కాపాడలేకపోయాడు సురేందర్ రెడ్డి. అయితే సైరా సినిమా ఫలితం ఏమిటన్నది పక్కన పెడితే.. ఒక డైరెక్టర్ గా సురేందర్ రెడ్డి సైరా కోసం మంచి పనితనమే కనబర్చాడు. కాకపోతే సక్సెస్ ను బట్టే ఇక్కడ విలువ ఉంటుంది. ఆ రకంగా సైరా సినిమా భారీ సక్సెస్ కాకపోవడం, ఇప్పుడు సురేందర్ రెడ్డికి పెద్ద సమస్య అయిపొయింది.

    Also Read: హైదరాబాద్ కు బై అంటున్న సురేఖా వాణి !

    నిజానికి ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుంటే.. సురేందర్ రెడ్డికి ఇది తలకు మించిన భారం అని అంటున్నారు సినీ జనాలు. ఏమైనా సురేందర్ రెడ్డి – రెబల్ స్టార్ ప్రభాస్ తో సినిమా అనగానే ఎక్కడా లేని నెగిటివ్ యాంగిలే ఎక్కువగా వినిపిస్తోంది. మరి ప్రభాస్ ఏమి చేస్తాడో.. ఇప్పటికే ప్రభాస్ కి సురేందర్ రెడ్డికి మధ్య కొన్ని సిట్టింగ్ లు కూడా జరిగాయి కాబట్టి.. ఆల్ రెడీ అంతా ఫిక్స్ అయింది కాబట్టి.. ఇక మరో మాట లేకుండా ప్రభాస్ ఈ సినిమా చేస్తాడేమో చూడాలి. కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం.. ప్లాప్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఏమిటి.. అసలు ప్లాప్ డైరెక్టర్ మీద 500 కోట్లు పెట్టడమేమిటి అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.