మూడోదశ పిల్లలకే ప్రమాదమా? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

దేశంలో కరోనా విలయతాండవం అందరికి తెలిసిందే. అన్నివర్గాల ప్రజల్ని అష్టకష్టాలు పెట్టింది. ప్రాణాలు సైతం హరించింది. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. మొదటి దశ కంటే రెండో దశ అత్యంత ప్రమాదకరంగా మారి జనాన్ని ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికే తెలియజేస్తున్నారు.కరోనా రెండో దశ ఇంకా […]

Written By: Srinivas, Updated On : July 10, 2021 10:46 am
Follow us on

దేశంలో కరోనా విలయతాండవం అందరికి తెలిసిందే. అన్నివర్గాల ప్రజల్ని అష్టకష్టాలు పెట్టింది. ప్రాణాలు సైతం హరించింది. దీంతో ప్రజలు అల్లాడిపోయారు. మొదటి దశ కంటే రెండో దశ అత్యంత ప్రమాదకరంగా మారి జనాన్ని ఇబ్బందులకు గురిచేసింది. ఈ నేపథ్యంలో కరోనా మూడో దశ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

పిల్లలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. చిన్నపిల్లలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పటికే తెలియజేస్తున్నారు.కరోనా రెండో దశ ఇంకా పూర్తి కాలేదు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనని చెబుతున్నారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మూడో దశ ఉంటుదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మూడో దశలో చిన్న పిల్లలపైనే ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయని సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా మూడో దశ ముప్పుపై ఇప్పటికే జాగ్రత్తలు తీసుకుంటోంది. వైద్య సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. సిలిండర్ల కొరత లేకుండా చూసేలా ఏర్పాట్లు చేస్తోంది. రెండో దశలో ఆక్సిజన్ దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన విషయం విదితమే.

కరోనా ప్రభావం పెద్దలతో పోల్చుకుంటే పిల్లల్లో తక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. పిల్లల్లో కరోనా వచ్చి తగ్గాక కూడా ప్రభావం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ప్రజలు నిబంధనలు పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దీంతో కరోనా మళ్లీ విజృంభించే అవకాశాలు లేకపోలేదని ప్రకటిస్తున్నారు. పెద్దల మాదిరిగా పిల్లల్లో కూడా లక్షణాలు ఒకేలా ఉంటాయని చెబుతున్నారు. సాధారణంగా జ్వరం, దగ్గు, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కుదిబ్బడ, గొంతులో మంట, కండరాల నొప్పులు, తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి వచ్చే లక్షణాలు కనిపిస్తాయని సూచిస్తున్నారు.

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆస్పత్రికి వెళ్లాల్సిందే పిల్లలను బయటకు పంపించవద్దు. అత్యవసరంగా బయటకు వెళ్తే కచ్చితంగా మాస్కు ధరించేలా జాగ్రత్త పడాలి. భౌతిక దూరం పాటించాలి. ఎప్పుడు చేతులను శుభ్రం చేసుకుంటూ నిబంధనలు పాటించాలి. జాగ్రత్తగా ఉంటేనే వ్యాధిని దూరం చేసుకోగలం. అప్రమత్తతోనే వైరస్ కట్టడి సాధ్యమనే విషయం గుర్తించాలి. అప్పుడే మనం వైరస్ ను నిర్మూలించడం సాధ్యం అవుతుంది.