ముందుంది థర్డ్ వేవ్ ముప్పు..?

  కరోనా రక్కసితో ఇప్పటికే ప్రపంచం అల్లకల్లోలమైంది. ముఖ్యంగా ఎక్కువ జనాభా కలిగిన భారత్ ను కరోనా ఛిన్నాభిన్నం చేసింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో చాలా మంది వైరస్ బారినపడి మరణించారు. ఇంకా కొందరు వైరల్ కోరల్లో చిక్కుకున్నారు. అయితే సెకండ్ వేవ్ గత నెల రోజుల కిందట తగ్గుముఖం పట్టినా కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇండియాలో థర్డ్ వేవ్ తప్పదా..? అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ఉండొచ్చని […]

Written By: NARESH, Updated On : July 10, 2021 10:51 am
Follow us on

 

కరోనా రక్కసితో ఇప్పటికే ప్రపంచం అల్లకల్లోలమైంది. ముఖ్యంగా ఎక్కువ జనాభా కలిగిన భారత్ ను కరోనా ఛిన్నాభిన్నం చేసింది. ఫస్ట్ వేవ్ కంటే సెకండ్ వేవ్లో చాలా మంది వైరస్ బారినపడి మరణించారు. ఇంకా కొందరు వైరల్ కోరల్లో చిక్కుకున్నారు. అయితే సెకండ్ వేవ్ గత నెల రోజుల కిందట తగ్గుముఖం పట్టినా కొన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దీంతో ఇండియాలో థర్డ్ వేవ్ తప్పదా..? అనే సంకేతాలు వినిపిస్తున్నాయి. కరోనా థర్డ్ వేవ్ ఉండొచ్చని ఇప్పటికే పలువురు వైద్య నిపుణులు తెలిపారు. అయితే ఎప్పుడు ఉంటుందని చెప్పలేమంటున్నారు.

ఇటీవల మహారాష్ట్రలోని ఫూణె, నాసిక్, అహ్మద్ నగర్ ప్రాంతాల్లో కేసులు మళ్లీ గణనీయంగా పెరుగుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు విధించారు. కేరళతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అప్రమత్తమైన ప్రభుత్వం ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపింది. అక్కడి పరిస్థితులను తెలుసుకొని తగిన సూచనలు చేయనున్నారు. అయితే సెప్టెంబర్ లేదా అక్టోబర్లో మూడో వేవ్ ఉండొచ్చని వైద్యులు అంచనా వేశారు. తాజాగా అధ్యయనం ప్రకారం జూలై లాస్ట్ వీక్ లేదా ఆగస్ట్ మొదటి వారంలో కేసుల పెరుగుదల ఉంటుందంటున్నారు.

అయితే ఇండియా వ్యాక్సిన్ విషయంలో చాలా వెనుకబడి ఉంది. ఇప్పటి వరకు కేవలం 5 శాతం లోపే వ్యాక్సినేషన్ జరిగింది. అమెరికా 47.1 శాతం, ఇంగ్లాండ్ 48.7 శాతం, ఇజ్రాయెల్ 59.8 శాతం, స్పెయిన్ 38.5 శాతం వేసింది. దీంతో ఇండియా పోజిషన్ ఎక్కుడుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా కేంద్రం అప్రమత్తం కాకుంటే థర్డ్ వేవ్లోనూ ప్రమాధ ఘంటికలు మోగక తప్పదంటున్నారు. అయితే థర్డ్ వేవ్లో ఎక్కువగా చిన్న పిల్లలపై ప్రభావం ఎక్కువగా ఉంటుందని కొందరు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం థర్డ్ వేవ్ ను అడ్డుకునేందుకు సన్నాహాలు చేపట్టింది. ఇప్పటికే సుప్రీం కోర్టు మూడో వేవ్ ను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారంటూ ప్రశ్నించింది. అయితే ప్రభుత్వం తాజా కేబినేట్ సమావేశంలో వైద్య, మౌలిక సదుపాయాల కోసం రూ.23.123 కోట్లను కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకొని ముందుగానే అప్రమత్తమైంది. చిన్నపిల్లలకు ప్రత్యేకంగా బెడ్లను కేటాయించారు. ముఖ్యంగా ఆక్సిజన్ కొరత లేకుండా పటిష్ట చర్యలు తీసుకోనుంది.