జగన్ ది అధికార దుర్వినియోగమా?

అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. అధికారంలో కొనసాగడానికి అర్హులు కారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతటి వారినైనా ఇంటికి పంపేయవచ్చు. బలవంతంగా అయినా తీసేస్తారు. అత్యున్నత మేనేజ్ మెంట్ ప్రమాణాలు పాటించే కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఇవే ప్రమాణాలు పాటిస్తారు. కానీ ప్రభుత్వమే అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఏం చేయాలి? దాని యజమాని బాధ్యత తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ డైలమాలో పడిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అభియోగాలున్నాయి. […]

Written By: Srinivas, Updated On : June 16, 2021 10:59 am
Follow us on

అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. అధికారంలో కొనసాగడానికి అర్హులు కారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తే ఎంతటి వారినైనా ఇంటికి పంపేయవచ్చు. బలవంతంగా అయినా తీసేస్తారు. అత్యున్నత మేనేజ్ మెంట్ ప్రమాణాలు పాటించే కార్పొరేట్ కంపెనీల్లో కూడా ఇవే ప్రమాణాలు పాటిస్తారు. కానీ ప్రభుత్వమే అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఏం చేయాలి? దాని యజమాని బాధ్యత తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఈ డైలమాలో పడిపోయింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని అభియోగాలున్నాయి. చట్టం, రాజ్యాంగాలను పట్టించుకోవడం లేదని చాలా కాలంగా ఆరోపణలున్నాయి. తొలిసారిగా హైకోర్టు ఈ విషయాన్ని ధృవీకరించింది. మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా అశోక్ గజపతిరాజును తొలగిస్తూ రాత్రికి రాత్రి సంచైత అనే మహిళను చైర్మన్ గా నియమించడంపై దాఖలైన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పులో సంచలన వ్యాఖ్యలు చేసింది. సంచైత నియామకాన్ని హైకోర్టు కొట్టివేసిన తీర్పులో కీలకమైన వ్యాఖ్యలు ఉన్నాయి.

ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లుగా హైకోర్టు నిర్ధారించింది. కేవలం అశోక్ గజపతిరాజును తొలగించడానికే సంచైతకు చైర్మన్ పదవి ఇవ్వడానికే ఎలాంటి నియమ నిబంధనలు పాటించకుండా అధికార దుర్వినియోగం చేస్తూ ఆ పని పూర్తి చేశారని హైకోర్టు ఆక్షేపించింది. ఇప్పుడు హైకోర్టు వ్యాఖ్యలు న్యాయ, రాజకీయ వర్గాల్లో సంచలనం అయ్యే సూచను కనిపిస్తున్నాయి.

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ప్రజా సంక్షేమం కోసం కాకుండా రాజకీయ అవసరాల కోసం దుర్వినియోగం చేసినట్లుగా తేలడమే దీనికి కారణం. నైతికంగా అధికారాన్ని దుర్వినియోగం చేసిన వారికి పదవిలో ఉండే అర్హత లేదు.అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఇలాంటి వాటిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి పరిస్థితులకే రాజీనామాలు చేయాల్సి వస్తే కనీసం ఇప్పటికి వంద సార్లు రాజీనామా చేసి ఉండాల్సింది అంటున్నారు.