https://oktelugu.com/

నాగార్జున మరో సాహసం

హీరో రాజశేఖర్ తో ‘గరుడవేగ’ లాంటి మంచి థ్రిల్లర్ యాక్షన్ మూవీ తీసి హిట్ కొట్టిన దర్శకుడు ‘ప్రవీణ్ సత్తారు’ తాజాగా అదే జోనర్ లో భారీ యాక్షన్ మూవీని చేపట్టారు. అగ్రహీరో నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందబోతోంది. ఈ సినిమా కోసం నాగార్జున ఓ భారీ సాహసమే చేయబోతున్నారట.. ఇందులో కీలకమైన యాక్షన్ ఘట్టాల కోసం నాగార్జున ప్రత్యేకం గా శిక్షణ కూడా తీసుకుంటున్నాడట.. ప్రపంచంలోనే అత్యంత సుశిక్షిత యుద్ధ […]

Written By: , Updated On : June 16, 2021 / 11:26 AM IST
Follow us on

హీరో రాజశేఖర్ తో ‘గరుడవేగ’ లాంటి మంచి థ్రిల్లర్ యాక్షన్ మూవీ తీసి హిట్ కొట్టిన దర్శకుడు ‘ప్రవీణ్ సత్తారు’ తాజాగా అదే జోనర్ లో భారీ యాక్షన్ మూవీని చేపట్టారు. అగ్రహీరో నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందబోతోంది.

ఈ సినిమా కోసం నాగార్జున ఓ భారీ సాహసమే చేయబోతున్నారట.. ఇందులో కీలకమైన యాక్షన్ ఘట్టాల కోసం నాగార్జున ప్రత్యేకం గా శిక్షణ కూడా తీసుకుంటున్నాడట..

ప్రపంచంలోనే అత్యంత సుశిక్షిత యుద్ధ విద్యలైన ఇజ్రాయిలీ యుద్ధ విద్యలను నాగార్జున నేర్చుకుంటున్నాడట.. క్రావ్ మాగా, సమురై స్వార్డ్ అనే ఇజ్రాయెల్ యుద్ధ విద్యల్లో శిక్షణ తీసుకుంటున్నారని సమాచారం.

ఈ సినిమాలో నాగార్జున ఓ మాజీ రా ఏజెంట్ అధికారిగా కనిపించనున్నారు. జూలై నుంచి చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాను నారాయణదాస్ నారంగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ కథానాయిక. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. త్వరలో రెండో షెడ్యూల్ కూడా మొదలవబోతోందట..

ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కోసం నాగార్జున ఈ వయసులోనూ సాహసాలకు పూనుకోవడం విశేషంగా మారింది.