Homeఆంధ్రప్రదేశ్‌Pakistan: ఖర్మ రిటర్న్‌.. పాకిస్తాన్‌లో వరుస పేలుళ్లు..విరుచుకుపడుతున్న డ్రోన్లు..!

Pakistan: ఖర్మ రిటర్న్‌.. పాకిస్తాన్‌లో వరుస పేలుళ్లు..విరుచుకుపడుతున్న డ్రోన్లు..!

Pakistan: ఖర్మ రిటర్న్‌.. ఈ పదం ఇటీవలి కాలంలో చాలా ఎక్కువగా వినిపిస్తుంది. ఒకడికి అన్యాయం చేస్తే.. న్యూటన్‌ థర్డ్‌ లా తరహాలో అంతే వేగంతో అన్యాయం రిటర్న్‌ వస్తుంది. గతంలో పోయిన జన్మలో చేసిన పాపం తగిలింది అనేవాళ్లు. కానీ ఇప్పుడు చేపిన తప్పులకు ఈ జన్మలోనే శిక్ష అనుభవించాల్సి వస్తోంది. భారత్‌లోని ప్రశాంత నగరాలైన ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌ వంటి నగరాల్లో పేలుళ్లు జరిపి అమాయకులు ప్రాణాలు బలితీసుకుని, అల్లర్లు, విధ్వంసం, ఆర్థిక నష్టం చేసింది పాకిస్తాన్‌. కానీ ఖర్మ రిటర్న్‌ అయింది. అదే పరిస్థితిని ఇప్పుడు పాకిస్తాన్‌ ఆఫ్గానిస్తాన్‌ నుంచి ఎదుర్కొంటోంది. తానే పెంచి పోసించిన టీటీపీ(తెహ్రీక్‌ ఎ తాలిబాన్‌ పాకిస్తాన్‌) పాకిస్తాన్‌లో వరుస దాడులు చేస్తోంది. దీంతో అఫ్ఘానిస్తాన్‌–పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు తీవ్రంగా ఉద్రిక్తమయ్యాయి. అఫ్గానిస్తాన్‌ నుంచి డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇవి సైనిక లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు అష్గాన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఖైబర్‌ఫఖ్తూంఖ్వాలో వరుస పేలుళ్లు..
టీటీపీ సంస్థ ఖైబర్‌ఫఖ్తూంఖ్వా ప్రాంతంలో వరుస దాడులు, పేలుళ్లు చేస్తోంది. ఇవి సరిహద్దు పోస్టులు, భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ పరిణామాలు రెండు దేశాల మధ్య జరిగిన మునుపటి సైనిక చర్యలకు ప్రతీకారంగా చూడవచ్చు. పాకిస్తాన్‌ మునుపు అఫ్ఘానిస్తాన్‌లోని మిలిటెంట్‌ లక్ష్యాలపై దాడులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి. దీంతో అఫ్ఘాన్‌ తరఫు ప్రతిస్పందనగా డ్రోన్లు, సరిహద్దు దాడులు వచ్చాయి. టీటీపీ కూడా వీడియోలు విడుదల చేస్తూ తన చర్యలను ప్రచారం చేస్తోంది. టీటీపీ దాడులు,

అంతర్గత భద్రతా సవాళ్లు..
ఖైబర్‌ పఖ్తూంఖ్వాలో టీటీపీ నిరంతర దాడులు పాకిస్తాన్‌ భద్రతా వ్యవస్థకు పెద్ద సవాలుగా మారాయి. వరుస పేలుళ్లు, సైనిక శిబిరాలపై దాడులు, వంతెనలు ధ్వంసం చేయడం వంటి చర్యలు జరుగుతున్నాయి. ఇవి స్థానిక ప్రజల్లో భయాన్ని కలిగిస్తున్నాయి. టీటీపీ పాకిస్తాన్‌లోని ఒక మిలిటెంట్‌ సంస్థ. దీని మూలాలు పాకిస్తాన్‌లోని తాలిబాన్‌ సంబంధిత గ్రూపుల నుంచి వచ్చాయి. పాకిస్తాన్‌ చాలా కాలం పాటు అఫ్ఘాన్‌ తాలిబాన్‌ను మద్దతు ఇచ్చిన నేపథ్యంలో, ఇప్పుడు ఆ సంస్థలోని కొన్ని వర్గాలు పాకిస్తాన్‌పైనే తిరుగుబాటు చేస్తున్నాయి.

డ్యూరాండ్‌ రేఖ వద్ద సంఘర్షణలు..
ఆఫ్గానిస్తాన్‌–పాకిస్తాన్‌ మధ్య ఎప్పటి నుంచో వివాదాస్పదంగా ఉంది. ఆఫ్గానిస్తాన్‌ ఈ రేఖను అంగీకరించదు. ఇటీవల ఈ సరిహద్దు వద్ద పాకిస్తాన్‌ సైన్యం పోస్టులపై దాడులు, పోస్టులు ధ్వంసం వంటి చర్యలు నివేదించబడ్డాయి. ఈ దాడులు ప్రాంతీయ నియంత్రణ కోసం, మరియు మునుపటి పాకిస్తాన్‌ చర్యలకు ప్రతీకారంగా జరుగుతున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలు ఒకరినొకరు మిలిటెంట్లను ఆశ్రయించడం, సరిహద్దు ఉల్లంఘనలు చేయడం అనే ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఇది సరిహద్దు వద్ద శాశ్వత అశాంతికి దారితీస్తోంది.

పాకిస్తాన్‌ 1990ల నుంచి ఆఫ్గాన్‌ తాలిబాన్‌ను మద్దతు ఇచ్చింది. 2001 తర్వాత కూడా కొన్ని వర్గాలు ఆ సంబంధాలు కొనసాగించాయని విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తాలిబాన్‌ వర్గాలు పాకిస్తాన్‌పై దాడులు చేస్తుండటం చాలా మందికి వ్యంగ్యంగా అనిపిస్తోంది. టీటీపీని ‘‘పాకిస్తాన్‌ సృష్టించినది’’ అనే వాదన కూడా వినిపిస్తుంది. వాస్తవానికి టీటీపీ 2007లో ఏర్పడిన సంకలన సంస్థ. ఇది పాకిస్తాన్‌ సైన్యం వ్యతిరేకంగా ఏర్పడింది. పాకిస్తాన్‌ గతంలో భారత్‌పై జరిగిన కొన్ని ఉగ్రవాద దాడులకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంది. ఇప్పుడు తన సరిహద్దులోనే ఇలాంటి దాడులు ఎదుర్కోవడం ‘‘ఖర్మ రిటర్న్‌’’ అనే భావనను కొందరు వ్యక్తం చేస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version