మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడిగా లోకేష్ బాబు అందరికీ సుపరిచితమే. టీడీపీ నేతలంతా లోకేష్ బాబును చినబాబు అని ముద్దుగా పిలుచుకుంటారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ పదవీ దక్కించుకొని చంద్రబాబు కోటాలో ఈజీగా మంత్రి అయిపోయారు. ఐటీ శాఖ మంత్రికి టీడీపీ హయాంలో పనిచేసి రాష్ట్రానికి కొన్ని పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. అయితే గత ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీచేసిన లోకేష్ దారుణంగా ఓటమి పాలయ్యారు. సీఎం కుమారుడు, మంత్రిగా పని చేసిన లోకేష్ ఓటమి పాలవడంతో ఆయన స్టెమీనాపై పార్టీ శ్రేణుల్లో అనుమానాలు రేకెత్తాయి.
Also Read: మీడియాకు చంద్రబాబు ఎంత పంచాడో తెలుసా?
2019 ఎన్నికల్లో వైసీపీ సర్కార్ అధికారంలో వచ్చింది. సీఎం జగన్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని బయటికి తీస్తూ చంద్రబాబు క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వారిని కటకటల వెనక్కి పంపుతున్నారు. దీంతో టీడీపీ నేతలంతా సైలంట్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో లోకేష్ బాబు టీడీపీ నేతలకు తాను అండగా ఉంటానంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు లోకేష్ కొన్ని కార్యక్రమాలు చేయాలని భావించారు. అయితే ఏపీలో కరోనా ఉధృతి కారణంగా వాటిని వాయిదా వేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం ఏపీలో కరోనా ఉధృతి ఉన్నప్పటికీ డిసెంబర్ నాటికి పూర్తిగా తగ్గముఖం పట్టే అవకాశాలున్నాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దీంతో సంక్రాంతి నుంచి లోకేష్ సైకిల్ యాత్ర చేపట్టేందుకు సిద్ధపడుతున్నారనే టాక్ విన్పిస్తున్నారు. గతంలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, నేటి సీఎం జగన్మోహన్ రెడ్డిలు ఏపీలో పాదయాత్రలు చేపట్టి అధికారంలోకి వచ్చారు. అయితే లోకేష్ మాత్రం పాదయాత్ర కాకుండా తమ పార్టీ గుర్తు అయిన సైకిల్ పై యాత్ర చేసేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఇప్పటికే టీడీపీ నేతలు సైకిల్ యాత్రకు సంబంధించిన రోడ్ మ్యాప్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: టీడీపీ కోవర్టుల చీటీ చిరిగేలా ఉందే..!
టీడీపీ భవిష్యత్ ఆశాకిరణం లోకేష్ బాబేనని ఆ పార్టీ శ్రేణులు బలంగా నమ్ముతున్నారు. ఇప్పటివరకు లోకేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో ఇప్పటివరకు నిరూపించుకోలేకపోయినప్పటికీ సైకిల్ యాత్ర ద్వారా తన ఇమేజ్ ను పెంచుకోవడంతోపాటు పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకు రెడీ అవుతున్నారు. ఏపీలో కరోనా ఉధృతి కారణంగా హైదరాబాద్ కే పరిమితమైన లోకేష్ ట్వీటర్లో మాత్రం వైసీపీ, సీఎం జగన్ పై ట్వీట్లు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మాజీ సీఎం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిలు కేవలం పాదయాత్ర చేస్తేనే అధికారంలోకి రాలేదని.. వారికి ఉన్న సొంత ఇమేజ్ కు పాదయాత్ర కలిసొచ్చిందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అయితే లోకేష్ సొంత ఇమేజ్ లేకుండా సైకిల్ యాత్రకు సిద్ధపడటం సాహసయాత్రే అవుతుందని పలువురు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.