https://oktelugu.com/

మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్‌ ఆమోదం..!

మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను చట్టసభల్లో ఆమోదించి చట్టరూపంలోకి తేవాలని చూసింది. అధికార పార్టీకి శాసన మండలిలో బలం లేకపోవడంతో మండలిలో అధిక సంఖ్యలో సభ్యులు ఉన్న టిడిపి ఈ బిల్లులను అడ్డుకుంది. సాంకేతిక కారణాలను చూపి ఈ బిల్లులను ఆమోదించుకోవడం ప్రభుత్వం విజయం సాధించింది. కొద్ది రోజులుగా గవర్నర్ వద్ద ఉన్న బిల్లులకు ఆయన ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. కొద్ది రోజులుగా ఈ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 31, 2020 / 06:53 PM IST
    Follow us on


    మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను చట్టసభల్లో ఆమోదించి చట్టరూపంలోకి తేవాలని చూసింది. అధికార పార్టీకి శాసన మండలిలో బలం లేకపోవడంతో మండలిలో అధిక సంఖ్యలో సభ్యులు ఉన్న టిడిపి ఈ బిల్లులను అడ్డుకుంది. సాంకేతిక కారణాలను చూపి ఈ బిల్లులను ఆమోదించుకోవడం ప్రభుత్వం విజయం సాధించింది. కొద్ది రోజులుగా గవర్నర్ వద్ద ఉన్న బిల్లులకు ఆయన ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. కొద్ది రోజులుగా ఈ వ్యవహారంపై న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణుల సలహాలు తీసుకున్న గవర్నర్ విశ్వభూషన్ హరిచందన్ బిల్లులపై ఈ రోజు సంతకం చేశారు.

    Also Read: ఏపీలోనూ పీవీ పేరు మార్మోగనుందా?

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను తొలుత ప్రభుత్వం శాసనసభ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టారు. అప్పుడు శాసనసభలో బిల్లులు ఆమోదం పొందడంతో ప్రభుత్వం శాసన మండలికి పంపింది. మండలిలో బిల్లులను ఆమోదించకుండా సెలక్ట్ కమిటీకి పంపాలని చర్చ అనంతరం ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం మండలి కార్యదర్శి ఛైర్మన్ ఆదేశాలకు అనుగుణంగా సెలక్ట్ కమిటీని నియమించలేదు. ఈ వ్యవహారంపై టిడిపి ఏమ్మెల్సీ దీపక్ రెడ్డి హై కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. మరోవైపు జూన్ 16 నుంచి రెండు రోజుల పాటు జరిగిన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో రెండవ పర్యాయం ఈ బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి మండలికి పంపింది. మండలిలో బిల్లులపై చర్చ జరగకుండానే నిరవదిక వాయిదా వేయడం జరిగింది. దీంతో 30 రోజుల అనంతరం శాసన మండలి బిల్లులను ఆమోదించినట్లుగా భావించి గవర్నర్ ఆమోదం కోసం జూలై 18వ తేదీన ప్రభుత్వం రాజ్ భవన్ కు పంపింది.

    Also Read: ఇంతలోనే అంత మార్పు ఏంటబ్బా..!

    పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలపోద్దని ప్రతిపక్ష పార్టీలు అన్నీ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు లేఖ రాశాయి. టిడిపి నాయకులు చట్ట ప్రకారం ఈ బిల్లులను గవర్నర్ ఆమోదించకూడదని, రాష్ట్రపతికి పంపాలని తెలిపింది. అప్పటి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అందరికంటే ముందు గవర్నర్ కు బిల్లులు ఆమోదించవద్దని లేఖ రాశారు. బిజెపి ఎంపీ సుజనా చౌదరి రాజధాని రైతులను తీసుకుని గవర్నర్ వద్దకు వెళ్లి వినతి పత్రాలు అందజేశారు. ఈ క్రమంలో రెండు వారాల సమయం తీసుకున్న గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఎట్టకేలకు పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులకు ఆమోదం తెలిపారు.