https://oktelugu.com/

Chandrababu: టీడీపీని గాడిలో పెట్టే వారి కోసమే బాబు ఎదురుచూపు?

Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్లందరు పార్టీని పట్టించుకోవడం లేదు. ఫలితంగా అధికారం అందకుండా పోతోందనే బాధ బాబులో మొదలైంది. దీంతో ప్రస్తుతం పార్టీని గట్టెక్కించే వారి కోసం చూస్తున్నారు. బావమరిది బాలయ్య సినిమా జోష్ లోనే కొనసాగుతున్నారు. అఖండ విజయంతో రాష్ర్టమంతటా పర్యటించి అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కానీ పార్టీని గురించి మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. దీంతో పార్టీ పరిస్థితి ఏమవుతుందోననే బెంగ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 15, 2021 1:09 pm
    Follow us on

    Chandrababu: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. సీనియర్లందరు పార్టీని పట్టించుకోవడం లేదు. ఫలితంగా అధికారం అందకుండా పోతోందనే బాధ బాబులో మొదలైంది. దీంతో ప్రస్తుతం పార్టీని గట్టెక్కించే వారి కోసం చూస్తున్నారు. బావమరిది బాలయ్య సినిమా జోష్ లోనే కొనసాగుతున్నారు. అఖండ విజయంతో రాష్ర్టమంతటా పర్యటించి అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. కానీ పార్టీని గురించి మాత్రం శ్రద్ధ చూపించడం లేదు. దీంతో పార్టీ పరిస్థితి ఏమవుతుందోననే బెంగ చంద్రబాబులో బలంగా పట్టుకుంది. ఈ నేపథ్యంలో పార్టీని విజయతీరాలకు చేర్చే వారి కోసం అన్వేషిస్తున్నారు.

    Chandrababu

    Chandrababu

    బాలయ్య అప్పటి నుంచి ఇప్పటివరకు పార్టీని ఏనాడు కూడా లెక్కచేయలేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా రాజకీయాల వైపు ఆయన ఆకర్షితులు కాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. పార్టీ కష్టాల్లో ఉంది. వైసీపీ ధాటికి టీడీపీ ఎక్కడో ఉండాల్సి వస్తోంది. దీంతో నేతల్లో కూడా అంతర్మథనం మొదలైంది. టీడీపీలో భవిష్యత్ లేదనే సంగతి అర్థమైపోతోంది. అందుకే రాజకీయ భవిష్యత్ కోసం పార్టీ మారేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

    సినిమాలపై ఉన్న శ్రద్ధ పార్టీపై లేకపోయిందనే బాధ బాబులో కలుగుతోంది. అందుకే పార్టీని ఎలా గెలిపించాలనే దానిపైనే తర్జనభర్జన పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాకపోతే ఇక కష్టమే సంకేతాలు వెలువడుతున్నాయి. లోకేష్ నాయకత్వంపై ఎవరికి కూడా పెద్దగా ఆసక్తి లేదు. ఆయనకు అంతటి వాగ్దాటి కూడా లేకపోవడం బాధాకరమే. ఈ నేపథ్యంలో పార్టీని రక్షించేవారెవరు? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

    Also Read: AP PRC: పీఆర్సీ లొల్లి.. వార్డు సచివాలయ ఉద్యోగులకు వర్తింపు

    అఖండ సినిమాలో ఓ డైలాగ్ పేలిపోయింది. కరుణించమని కోరుకో.. కనిపించమని కాదు అని ఇప్పుడు అదే తెలుగుదేశం పార్టీకి కూడా సరిగా సరిపోతోందనే వాదన వినిపిస్తోంది. దీంతో బాలయ్య అభిమానులు, పార్టీ కార్యకర్తలు సైతం పార్టీని గాడిలో పెట్టే పనిని తీసుకోవాలని కోరుతున్నారు. కానీ బాలయ్య ఏ మేరకు స్పందించి పార్టీకి జవసత్వాలు నింపుతారో వేచి చూడాల్సిందే.

    Also Read: Movie Ticket Prices: టికెట్ ధరలు తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవోను రద్దు చేసిన హైకోర్టు!

    Tags