https://oktelugu.com/

Pushpa: బన్నీకి ఇష్టమైన బెస్ట్ కోలీవుడ్​ డాన్సర్​ ఎవరో తెలుసా?

Pushpa: అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. నిన్ననే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కాగా దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్లడంతో ఈవెంట్ కు హాజరు కాలేకపోయారు.కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 15, 2021 / 11:16 AM IST
    Follow us on

    Pushpa: అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న సినిమా ‘పుష్ప’. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీని డిసెంబర్ 17న విడుదల చేయనున్నారు. నిన్ననే ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. కాగా దర్శకుడు సుకుమార్, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్లడంతో ఈవెంట్ కు హాజరు కాలేకపోయారు.కాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తోంది. అలానే సినిమాలో పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రీసెంట్ గా సమంత నటించిన ఐటెం నెంబర్ ‘ఊ అంటావా మావా ఊహూ అంటావా’ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు. విడుదలైన కొద్ది గంటల్లోనే  సౌంత్​ఇండియాలోనే మోస్ట్​ వ్యూడ్​ సాంగ్​గా రికార్డు నెలకొల్పింది. మిలియన్ల వ్యూస్​తో దూసుకెళ్లిపోతోంది. ఇందులో బన్నీ, సమంత స్టెప్పులు ఇరగదీశారని మేకర్స్ చెబుతున్నారు.

    Pushpa

    ఈ సినిమా రిలీజ్​కు ఇంకో రెండ్రోజులు మాత్రమే మిగిలింది. దీంతో ప్రమోషన్స్​ విషయంలో వేగం పెంచింది పుష్ప టీమ్​. కేవలం తెలుగులోనే కాకుండా, ఇతర భాషల్లోనూ ప్రమోషన్లకు జోరు పెంచింది. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ తమిళ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు బన్నీ.

    Also Read: ‘పుష్ప’తో పని చేయనున్న రాజమౌళి?

    తన సినిమాలు యూట్యూబ్​లో హిందీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయని.. అయితే, తమిళనాడు ప్రేక్షకుల మనసును కూడా గెలవాలని ఉందని మనసులో మాట చెప్పారు బన్నీ. పుష్ప సినిమా కోలీవుడ్​ ప్రేక్షకులను బాగా కనెక్ట్ అయ్యిందని..ఇందుకు దేవి శ్రీ ప్రసాద్​కు ధన్యవాదాలు తెలిపారు. కాగా, డాన్స్​లో ఫుల్​ క్రేజ్​ సంపాదించుకున్నారు బన్నీ. అతని నుంచి సినిమాలొస్తాయంటే చాలు కొత్త స్టెప్పులు కూడా ఉంటాయని ఆశిస్తుంటారు ప్రేక్షకులు. అయితే, తన డాన్స్​తో ఇంతమందిని ఆకట్టుకున్న బన్నీకి ఇష్టమైన డాన్సర్ ఎవరని అడగ్గా.. కమల్​ హాసన్​, విజయ్​, ధనుష్​, శింబు, శివకార్తికేయన్​ బాగా డాన్స్ చేస్తారనేది నా అభిప్రాయమని బన్నీ చెప్పుకొచ్చారు.

    Also Read: పుష్పకు కష్టాలు మొదలయ్యాయి.. అల్లు అర్జున్ స్వయంకృపరాధం!