Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలక్షణ పాత్రలు పోషించి చిత్ర సీమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్. కేవలం సినిమాల పరంగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా ముందుంటూ తన వంతుగా ప్రజల కొరకు పాటు పడుతూ ఉంటారు. గ్రామాన్ని దత్తత తీసుకోవడమే కాకుండా, కరోనా సమయంలో ప్రజలకు అండగా నిలిచారు. ప్రకాష్ రాజ్ మళ్లీ మరోసారి తన మంచి మనసుతో ఓ అమ్మాయి జీవితంలో వెలుగులు నింపారు. యూకేలో ఉన్నత చదువులు పూర్తి చేసేందుకు ఆమెకు ఆర్థిక సాయం అందించారు. సినిమా దర్శకుడైన నవీన్ మహ్మదాలీ ట్వీట్ తో ఈ విషయం బయటకు తెలిసింది. శ్రీ చందన అనే అమ్మాయి చదువుల సరస్వతి. ఆమెకు బ్రిటన్లో మాస్టర్స్ చదివే అవకాశం వచ్చింది. అదే సమయంలో ఆమె తండ్రి మరణించారు. దీంతో ఆర్ధిక సమస్యలు చుట్టుముట్టి యూకే యూనివర్సిటీవారి సీటును వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: ఛ.. వీడేం హీరో ? వద్దులే అండి కృష్ణగారు !
ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రకాష్ రాజ్ వెంటనే స్పందించి ఆమె చదువుకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. శ్రీచందన ఇటీవలే యూకేలో మాస్టర్స్ పూర్తి చేసింది. ఆమె చదువుకైన ఖర్చునంతా ఆయనే భరించారు. ఇప్పుడు బ్రిటన్లో ఉద్యోగం పొందడానికి కూడా డబ్బు అవసరం పడింది శ్రీచందనకి. ఆ బాధ్యతను కూడా తానే తీసుకున్నారు ప్రకాష్. ఆమె ఉద్యోగానికి కూడా కట్టాల్సిన మొత్తాన్ని ఆమెకు అందించారు. ఈ విషయాన్ని నవీన్ మహ్మదాలీ ట్విట్టర్లో పోస్టు చేశారు. పేద యువతి జీవితంలో వెలుగులు నింపినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. నవీన్ ట్వీట్ ను రీట్వీట్ చేస్తూ ‘ఈ విషయాన్ని నా దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు. అనేక చేతులు కలిసినప్పుడు ఇలాంటివి సాధ్యమవుతాయి… ద జోయ్ ఆఫ్ ఎంపవరింగ్’ అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Thank you too @NaveenFilmmaker for bringing my attention to this. It’s a joy when many hands join together to make a difference..stay blessed.. “the joy of empowering” #bliss https://t.co/TnFziFUO51
— Prakash Raj (@prakashraaj) December 15, 2021
Also Read: ఇంపాజిబుల్ సిచ్యువేషన్స్‌లో పోర్న్ చూస్తా.. ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్