https://oktelugu.com/

జగన్ సార్.. ప్రచారానికే ప్రాధాన్యమా?

ఏపీ ప్రభుత్వం ప్రకటనల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తోంది. ప్రతి పనికి ఫుల్ పేజీ కవరేజీ ఇస్తూ ప్రజాధనాన్ని వృథా అవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ మళ్లీ చేసే శంకుస్థాపనలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తుండడం గమనార్హం. ఆరు నెలల క్రితం పేదలకు ఇచ్చిన సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాన్ని సీఎం ప్రారంభించారు. దీనికి గుర్తుగా పలు చోట్ల పైలన్లు నిర్మించారు. మళ్లీ ఆరునెలల తరువాత ఈ రోజున ఇళ్ల నిర్మాణాలను మళ్లీ ప్రారంభిస్తున్నారు.ఇందుకు మళ్లీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 3, 2021 / 02:06 PM IST
    Follow us on

    ఏపీ ప్రభుత్వం ప్రకటనల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తోంది. ప్రతి పనికి ఫుల్ పేజీ కవరేజీ ఇస్తూ ప్రజాధనాన్ని వృథా అవుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు మళ్లీ మళ్లీ చేసే శంకుస్థాపనలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తుండడం గమనార్హం. ఆరు నెలల క్రితం పేదలకు ఇచ్చిన సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణాన్ని సీఎం ప్రారంభించారు. దీనికి గుర్తుగా పలు చోట్ల పైలన్లు నిర్మించారు. మళ్లీ ఆరునెలల తరువాత ఈ రోజున ఇళ్ల నిర్మాణాలను మళ్లీ ప్రారంభిస్తున్నారు.ఇందుకు మళ్లీ ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేశారు. ప్రభుత్వ తీరుపై ఆశ్చర్యం వ్యక్తం అవుతోంది.

    పేదలకు కట్టించి ఇచ్చే ఇళ్ల నిర్మాణం నిర్దేశిత నమూనాలో నిర్మిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణం ప్రభుత్వానికి భారంగామారే పరిస్థితి ఉండడంతో లబ్ధిదారులకే ఇళ్ల నిర్మాణ బాధ్యతలు అప్పగించాలనుకున్నారు. ఇందులోరెండు లబ్ధిదారులే కట్టుకోవాలి. మూడోది ప్రభుత్వమే కట్టివ్వాలి.ఎక్కువ మంది మూడో దానికే ఆప్షన్లు ఇచ్చారు. దీంతో ప్రభుత్వానికి ఏం చేయాలో అర్థం కావడంలేదు.

    ప్రభుత్వం ఇళ్లు కట్టిస్తున్నందున ఆప్షన్ ప్రస్తుతం లేదు. కావాల్సిన నిర్మాణ సామగ్రి అంతా సమకూర్చి పెట్టి కట్టిస్తాం అని చెబుతున్నారు. సామగ్రిఇస్తే లబ్ధిదారులే ఇళ్లు కట్టుకోవాలన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం తీరు సందేహాత్మకంగా మారండంతో లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. పనులు వేగంగా జరిగేలా చూడాలని సీఎం ఆదేశించారు.

    ఇళ్ల నిర్మాణం ఒక ఎత్తయితే ఆ స్థలాల వద్ద సీఎం జగన్ చెప్పినట్లుగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ సిమెంట్ రోడ్లు సహా అనేక సౌకర్యాలు కల్పించడం ఓ సవాలే. వీటిని పూర్తి చేయకపోతే ఆ నివాస స్థలాలు ఎందుకు ఉపయోగపడవు. ప్రభుత్వం ఈ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే లబ్ధిదారులు వ్యతిరేకమయ్యే ప్రమాదం ఉంది.